Sajjala Ramakrishna Reddy: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీదుగా అసమ్మతి స్వరం ఎక్కువ అవుతుంది. అధికార పార్టీలోని చాలామంది ఎమ్మెల్యే లు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం మీద అసహనంతో ఉన్నారనే మాట చాలా రోజులుగా వినిపిస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి విధేయులుగా ఉన్న వారిని, అలాగే మొదటి నుంచి జగన్ వెంట నడిచిన నాయకులను సజ్జల రామకృష్ణారెడ్డి టార్గెట్ గా చేసుకుని వ్యూహాత్మకంగా వారిని దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ ఉన్న మాట. తాజాగా మారుతున్న సమీకరణాలు చూస్తూ ఉంటే అలాగే కనిపిస్తుంది. జగన్ కి వెన్నంటే ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అలాగే జగన్ కి వీర విధేయురాలుగా ఉన్న ఉండవల్లి శ్రీదేవిని కూడా సస్పెండ్ చేశారు. దాంతోపాటు జగన్ కి మొదటి నుంచి అండగా ఉంటూ వచ్చిన నాయకులు ఇప్పుడు రాజకీయంగా యాక్టివ్ లేరనే చెప్పాలి. జగన్ వెన్నంటే ఉన్న అందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు. దీనికి కారణం జగన్ చుట్టూ సజ్జల కోటరీ అనే భావన ఉంది. ముఖ్యమంత్రి జగన్ కూడా సభ్యుల రామకృష్ణారెడ్డికి అధిక ప్రాధాన్యత చేస్తూ తన తరువాత నెంబర్ 2 పొజిషన్ లో ఉంచారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి లాంటి నాయకులు కూడా జగన్ కి దూరం అయ్యారు.
అలాగే వైవి సుబ్బారెడ్డికి కూడా పార్టీలో అంతగా ప్రాధాన్యత లేదని మాట వినిపిస్తోంది. సజ్జల వ్యవహారం అంతా కూడా అధికార పార్టీలోనే అంతర్గత చర్చకు దారితీస్తూ ఉంది. పార్టీ నుంచి బయటికి వచ్చిన నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ పైన ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. వారి టార్గెట్ అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి కావడం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్లకి మేనిఫెస్టో తయారు చేశారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ తర్వాత జగన్ చెంతకు చేరిన సజ్జల ఇప్పుడు తమ పైన విమర్శలు చేస్తున్నారని అన్నారు. వైసీపీ మేము అమ్ముడుపోయామని ఆరోపిస్తున్న సజ్జల తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీకి పడ్డ ఓట్లను ఎంతటి కొన్నారంటూ ఆనం ప్రశ్నించారు. అలాగే తనపై అసత్య ఆరోపణలు చేసిన సజ్జలపై పరువు నష్టం దావా వేస్తానంటూ ఆనం వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.