Amavasya: మన హిందూ సంప్రదాయాల ప్రకారం అధికమాస అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అధికమాస అమావాస్య అంటే సాక్షాత్తు శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైనటువంటి రోజు.ఇలా ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఇలా అధికమాసం ముగిసిన రోజు వచ్చే అమావాస్యను అధికమాస అమావాస్య అంటారు. ఏడాది అధికమాస అమావాస్య ఆగస్టు 16వ తేదీ వస్తుంది. మరి ఈ అధికమాస అమావాస్య రోజు ఎలాంటి పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అనే విషయానికి వస్తే…
అధికమాస అమావాస్య ఆగస్టు 15ఉదయం 12 గంటల 45 నిమిషాల నుంచి అమావాస్య తిథి ప్రారంభమవనుంది. అమావాస్య తిథి ఆగస్టు 16 మధ్యాహ్నం 3.07 గంటలకు ముగుస్తుంది. అయితే ఉదయ తిథి ప్రకారం ఆగస్ట్ 16న అధికమాస అమావాస్య స్నానం చేస్తారు.ఈ అమావాస్య రోజు ఉదయమే స్నానం ఆచరించి అనంతరం గణేశుడిని పూజించాలి. ఇలా గణేశుడి పూజ తర్వాత శివపార్వతులను పూజించాలి.
ఈ అమావాస్య రోజు మన పూర్వీకులు పితృదేవతలు సంతోషం కోసం దానం చేయడం ఎంతో మంచిది.బెల్లం మినుములు నెయ్యి వంటి వస్తువులను దానం చేయడం వల్ల పూర్వీకులు సంతోషం వ్యక్తం చేస్తారు. అమావాస్య రోజు విష్ణు పురాణం, శివపురాణం, రామాయణం వంటి గ్రంథాలను పఠించాలి.ఈ రోజుల్లో అన్నదానం కూడా చాలా పవిత్రమైనది ఏదైనా ఆలయానికి వెళ్లి అన్నదానం చేయించడం ఎంతో మంచిది.
Amavasya:
ఇక అమావాస్య రోజు చేయకూడని పనులు విషయానికి వస్తే ఆలస్యంగా నిద్రలేవకూడదు.ఈ అమావాస్య రోజున పొరపాటున కూడా మనం చీపురు కొనుగోలు చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. అందుకే అమావాస్య రోజు చీపురు కొనకూడదు అదేవిధంగా మత్తు పదార్థాలను మాంసం వంటి పదార్థాలను తినకపోవడం ఎంతో మంచిది.