Allu Sneha Reddy : అల్లు అర్జున్ ఈ పేరు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోంది.అల్లు అర్జున్ కి సంబంధించిన న్యూస్ కూడా సోషల్ మీడియాలో రోజుకొకటి ప్రత్యక్షమతోంది. పుష్ప సినిమాతో బన్నీ రేంజ్ మారిపోయింది పాన్ ఇండియన్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ప్రస్తుతం పుష్ప 2తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే అర్జున్ ఇండస్ట్రీ కి వచ్చిన కొద్ది కాలంలోనే తాను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లాడి ఓ ఇంటివాడయ్యాడు. స్నేహారెడ్డిని 2011లోనే లవ్ మ్యారేజ్ చేసుకుని బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పేశాడు. చిన్న పాప అర్హ శాకుంతలం సినిమాలో బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక పెళ్లి చేసుకున్నాక.. ప్రతి భర్తకు భార్య కండిషన్స్ తప్పవు. లేటెస్టుగా అల్లు అర్జున్ కు స్నేహ రెడ్డి ఓ విషయంలో షరతులు పెట్టిందట. ఈ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరో అయినప్పటికీ.. బన్నీ తన పర్ఫామెన్స్ తో సరికొత్త ఫ్యాషన్స్ ట్రెండ్స్ తో తనకంటూ స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో బన్నీ ఐకానిక్ స్టార్ అయ్యాడు. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం కూడా అందుకున్నాడు. ఇక పుష్ప 2 తర్వాత, బన్నీ సందీప్ రెడ్డి వంగాతో ఓ మూవీ చేయాల్సి ఉంది. ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదు. ఎందుకంటే సందీప్ వంగా యానిమల్ సీక్వెల్ చేయబోతున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేయాలి. ఆ తర్వాతే బన్నీ తో మూవీ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనూ బన్నీ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే బన్నీ త్రివిక్రమ్ తో జులైయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురం మూవీస్ చేసి హ్యాట్రిక్ హిట్స్ సాధించాడు. లేటెస్టుగా నాలుగవ చిత్రం కోసం ప్లాన్స్ జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ మూవీ లో యానిమల్ సినిమాలో బోల్డ్ యాక్టింగ్ తో మైండ్ బ్లాక్ చేసిన బ్యూటీ త్రిప్తి డిమ్రిని నటిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్నేహరెడ్డి అల్లు అర్జున్ కి కండిషన్స్ పెట్టిందట. ఆమెతో యాక్ట్ చేయకూడదని షరతులు పెట్టిందట. మరి ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ,సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బన్నీ హీరో కాబట్టి ఎవరితో అయినా నటించాల్సి వస్తుంది, ఇలా స్నేహరెడ్డి షరతులు పెట్టడం ఏంటని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది స్నేహరెడ్డి కరెక్ట్ అంటున్నారు.