Mon. Jan 19th, 2026

    Allu Sirish: అల్లువారబ్బాయి శిరీష్ మంచు లక్ష్మీకి ఇలా ముద్దు పెట్టేశాడేంటీ..? అంటూ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల వచ్చిన దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన నివాసానికి సూపర్ స్టార్ మహేశ్ బాబు దంపతులను, ఎన్.టి.ఆర్ దంపతులను, వెంకటేశ్ ఫ్యామిలీని, నాగార్జునని ఆహ్వానించారు. వారితో కలిసి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు.

    ఇక మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలాగూ అక్కడే ఉంటారు. ఈ మధ్యనే పెళ్లి చేసుకున్న వరుణ్ తేజ్, లావణ్య దంపతులు కూడా ఈ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ కలిసి ఒకే ఫ్రేం లో ఉన్న పిక్స్ నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. చిరు ఇంటికి ఒక్క బాలకృష్ణ తప్ప మిగతా టాప్ సెలబ్రిటీస్ అందరూ హాజరయ్యారు. దీనిపై కూడా నెట్టింట ఓ న్యూస్ బాగా వైరల్ అవుతోంది.

    allu-sirish-kissed like this Manchu Lakshmi..?
    allu-sirish-kissed like this Manchu Lakshmi..?

    Allu Sirish: మంచు లక్ష్మీ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు 

    అయితే, ఇదే క్రమంలో అల్లు శిరీష్ మంచు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టిన పిక్ ఒకటి నెట్టింట హల్‌చల్ చేస్తూ వైరల్ అవుతోంది. మంచు లక్ష్మీ అటు మెగా ఫ్యామిలీతో, ఇటు అల్లు ఫ్యామిలీతో అలాగే అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీలతో చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏ చిన్న సెలబ్రేషన్‌లో పాల్గొన్నా, దానికి సంబంధించిన వీడియోలను గానీ, ఫొటోలను గానీ తన ఇన్స్టాగ్రాం లో షేర్ చేస్తుంటుంది.

    అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ కి మంచు లక్ష్మీ కూడా హాజరైంది. సోదరుడుగా భావించే అల్లు శిరీష్‌తో మంచు లక్ష్మీ సరదాగా గడిపింది. ఆ సమయంలో తన అక్క వంటి మంచు లక్ష్మీ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టాడు శిరీష్. ఈ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.