Allu Arjun : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు అన్ని చోట్ల ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లోని బీఎస్ఎన్ఎల్ సెంటర్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశాడు. బన్నీతో పాటు ఆయన భార్య స్నేహారెడ్డి కూడా ఓటు వేసింది. అనంతరం ఐకాన్ స్టార్ మీడియాతో మాట్లాడారు. తన పొలిటికల్ ఎంట్రీపై సెన్సేషనల్ కామెంట్ చేశాడు. అంతే కాదు ఈ మధ్యనే నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి సపోర్ట్ ఇవ్వడంపై బన్నీ క్లారిటీ ఇచ్చాడు. తనకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదని, రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన అస్సలు లేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు.
“నాకు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. నాకు అన్ని పార్టీలు ఒక్కటే. నా అని అనుకునే వారు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా పర్సనల్ గా నా సపోర్ట్ వారికే ఇస్తాను. మా మావయ్య పవన్‌కల్యాణ్‌కు నా పూర్తి మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇక నంద్యాలలో రవిగారికి కూడా అదే విధంగా నా సపోర్ట్ తెలిపాను. ఒకవేళ ఫ్యూచర్ లో మా మావయ్య చంద్రశేఖర్‌గారు, బన్నివాస్ ఇలా వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వ్యక్తులెవరికైనా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కచ్చితంగా ఇస్తా. శిల్పా రవి 15ఏళ్లుగా నాకు స్నేహితుడు. మీరు పాలిటిక్స్ లోకి వస్తే, మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తాను అని ఆయనకు నేను మాటిచ్చాను. అయితే 2019 ఎన్నికల్లో ఆయనను కలవలేకపోయాను. నా మాట నిలబెట్టుకునేందుక ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి, ఫోన్ చేసి వస్తానని చెప్పాను. అందుకే స్నేహతో కలిసి నంద్యాల వెళ్లాను. పర్సనల్ గా ఆయనకు శుభాకాంక్షలు చెప్పాను. అంతే కానీ నాకు పాలిటిక్స్ లోకి వచ్చే వచ్చే ఉద్దేశం అస్సలు లేదు. “అని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చాడు.