Allu Arjun: బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్న ఐకాన్ స్టార్ అంటూ.. ఓ లేటెస్ట్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో చేసిన పుష్ప ఫ్రాంఛైజీస్‌తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్, తన నెక్స్ట్ సినిమాలను కూడా అదే స్కేల్‌లో ప్లాన్ చేసుకుంటున్నాడు. పుష్ప సినిమాలతో వచ్చిన క్రేజ్ అల్లు అర్జున్‌కి కోలీవుడ్ సహా బాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియన్ సినిమాలు చేసే అవకాశాలను తెచ్చిపెడుతోంది.
ప్రస్తుతం, తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్.. అల్లు అర్జున్ హీరోగా భారీ బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ సినిమాను నిర్మిస్తోంది. అట్లీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. దీపిక పడుకొణ్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లో 22వ సినిమాగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేస్తున్న ఈ సినిమా 2027లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ తన 23వ సినిమాను లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఇటీవలే అధికారికంగానూ ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఇలా, రెండు పాన్ ఇండియన్ సినిమాలను కోలీవుడ్ డైరెక్టర్స్‌తో చేస్తున్న అల్లు అర్జున్.. తన 24వ సినిమాను బాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ సంజయ్ లీల భన్సాలీ దర్శకత్వంలో చేయనున్నట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి బాలీవుడ్‌తో పాటు సౌత్ మీడియాలలోనూ ప్రచారం అవుతోంది. అత్యంత భారీ స్థాయిలో ఓ విజువల్ వండర్‌గా ఈ మూవీ రూపొందనుందట. ఇంటెన్స్ డ్రామా కూడా ఈ కథలో ఉందని తెలుస్తోంది.
అల్లు అర్జున్ ఎప్పటి నుంచో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. అందుకు, సంజయ్ లీల భన్సాలీ చెప్పిన కథ పర్ఫెక్ట్ అని ఈ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మరి, సుకుమార్ దర్శకత్వంలో చేయాల్సిన పుష్ప 3 ఎప్పుడు పట్టాలెక్కుతుందో, తెలియాల్సి ఉంది. గత రెండు భాగాలకంటే పుష్ప 3 మరింత హై ఓల్టేజ్ యాక్షన్ మూవీగా సుక్కూ రూపొందించడానికి పక్కాగా స్క్రిప్ట్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ రెండు సినిమాలను చేస్తున్న అల్లు అర్జున్..తన 24వ సినిమాగా బాలీవుడ్ మూవీ కానుందా, లేక పుష్ప ఫ్రాంఛైజీస్‌లో సుకుమార్ తెరకెక్కించనున్న సినిమా కానుందా..అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.