Anupama Parameswaran : ప్రస్తుతం మీడియం, కుర్ర హీరోలందరికీ అనుపమ పరమేశ్వరన్ బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. ఒకప్పుడు పద్ధతిగా ఒద్దికగా కనిపించిన అనుపమ ఈ మధ్యకాలంలో కాస్త ఘాటుగా గుబులు రేపుతోంది. టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన కొత్తలో కంప్లీట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే చిత్రాలనే కమిటైంది. అయితే, అనుపమకి అలాంటి డీసెంట్ చిత్రాలేవీ కమర్షియల్ హీరోయిన్‌గా నిలబెట్టలేకపోయాయి. అంతేకాదు, ముంబై భామల మధ్య పోటీ తట్టుకోలేక కొంతకాలం అవకాశాలను అందుకోలేకపోయింది.
ఒకదశలో ఇక తెలుగు తెరపై అనుపమ కనిపించడం కష్టమనే టాక్ కూడా వినిపించింది. కానీ, అనూహ్యంగా కార్తికేయ, రౌడీ బాయ్స్, 18 పేజెస్ చిత్రాలలో నటించే అవకాశాలను దక్కించుకొని షాకిచ్చింది. ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో నటించిన అనుపమ అంతకముందు చాలా డీసెంట్ రోల్స్ చేసి ఆకట్టుకుంది. కానీ, అదే దిల్ రాజు అన్న కొడుకోసం లిప్ లాక్ ఇవ్వక తప్పలేదు. ఇదెవరూ అనుపమ నుంచి ఊహించలేదు.
Anupama Parameswaran : ఇలాగే ఉంటే కొంతకాలం అమ్మడికి కెరీర్‌కి బ్రేకులు పడవు.
ఆ సినిమా నుంచి ఈ బ్యూటీలో మాస్ యాంగిల్ బాగా ఎక్కివైంది. ఫొటో షూట్ అంటే వీలైనత్మగా అందాలను ఆరబోస్తూ వాహ్..అనిపిస్తోంది. ఇప్పటి కుర్ర హీరోలకి అనుపమ మంచి ఛాయిస్‌గా మారిందని చెప్పొచ్చు. రౌడీ బాయ్స్, కార్తికేయ 2 చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ఇప్పుడు డీజే టిల్లు సీక్వెల్ మూవీలో నటిస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ ఈ మూవీలో మాంచి మసాలా సీన్స్ యాడ్ చేశాడట.
ముందు నటించిన నేహ శెట్టి సీక్వెల్ చేయనని చెప్పిందంటే ఎలాంటి ఇంటెన్సివ్ సీన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సీన్స్ చేయడానికి అనుపమ ఎస్..అన్నదంటే ఎలా డిసైడయిందో ప్రత్యేకంగానూ చెప్పనవసరం లేదు. ఏదేమైన అనుపమ మన సౌత్ ఆడియన్స్‌కి ఏం కావాలో అది కాస్త లేట్‌గా తెలుసుకుంది. ఇలాగే ఉంటే కొంతకాలం అమ్మడికి కెరీర్‌కి బ్రేకులు పడవు.