Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో బహిరంగసభని ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభగా ఇది ఉండబోతుంది. ఇప్పటికే ఈ సభ కోసం పోలీసులు సెక్షన్ 30 పేరుతో ఆంక్షలు విధించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం కూడా తనకున్న అన్ని అవకాశాలని ఉపయోగించుకొని సభకి ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సభపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. దీనికి కారణం ఈ ఆవిర్భావ సభ ద్వారా పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో ప్రభావితం చేసే కీలక విషయాలని వెల్లడిస్తాడని భావిస్తున్నారు. అలాగే ఏపీలో త్వరలో బస్సు యాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు.
అలాగే పొత్తులపై టీడీపీ చాలా ఆశలు పెట్టుకుంది. పొత్తులతోనే అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది. ఇక ఇప్పటికే టీడీపీ ద్వంద్వ రాజకీయాలని పవన్ కళ్యాణ్ కూడా గ్రహించారు. ఈ నేపధ్యంలో కచ్చితంగా ఈ సభలో టీడీపీ పార్టీకి కూడా గట్టిగానే కౌంటర్లు ఇచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇదిలా ఉంటే మరో వైపు జనసైనికులు, కాపు సంఘాలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కళ్యాణ్ నిర్ణయం ఏంటి అనేదానిపై వారికి ఎలాంటి క్లారిటీ లేదు.
ఇక 25 ఏళ్ళ రాజకీయ ప్రయాణం అనుకోని వచ్చిన పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో 10 ఏళ్ళు గడిచిపోయాయి. ఇంకా 15 ఏళ్ళు మాత్రమే ఉన్నాయి. ఈ నేపధ్యంలో 2024 ఎన్నికలు అతనికి చాలా కీలకం అని చెప్పాలి. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా బలమైన స్థానాలని సొంతం చేసుకుంటేనే అధికారంలొకి రావొచ్చు అని భావిస్తున్నారు. మరో వైపు బీజేపీ కూడా చాలా అనుమానంతోనే పవన్ కళ్యాణ్ ని చూస్తుంది. ఓ వైపు పొత్తు అంటున్న కూడా టీడీపీకి దగ్గర అవుతున్నాడు అనే ప్రచారం ఉన్న నేపధ్యంలో పొత్తుపై ఎలాంటి స్పష్టత ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.