Pawan Kalyan: ఏపీ రాజకీయాలలో కీ లీడర్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులు సినిమా షూటింగ్ లు చేసుకొని మళ్ళీ రాజకీయ ప్రయాణంలోకి అడుగుపెట్టి జనసేన ఆవిర్భావ సభ నిర్వహించడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కళ్యాణ్ మీద ఇన్ని రోజులు ఫోకస్ చేయని మీడియా మొత్తం మరల అతని వైపు దృష్టి పెట్టింది. దీనికి కారణం జనసేన అధినేత ఈ నలుగు రోజుల ప్రయాణంలో ఆయన రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే విషయంపై ఒక స్పష్టత రాబోతుంది. ఇక శనివారం మంగళగిరి కార్యాలయానికి చేరుకునే పవన్ కళ్యాణ్ బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. తరువాత పార్టీ నాయకులతో మరుసటి రోజు మీటింగ్ ఉంటుంది. అదే సమయంలో కాపు నేత హరిరామజోగయ్య కూడా పవన్ కళ్యాణ్ ని కలుస్తారు.
అనంతరం ఫ్యూచర్ ప్లాన్ గురించి పార్టీ నాయకులతో చర్చించి రాజకీయ కార్యాచరణపై వారికి దిశానిర్దేశ్యం చేస్తారు. అనంతరం జనసేన ఆవిర్భావ సభలో పాల్గొంటారు. ఈ సభ ద్వారా పవన్ కళ్యాణ్ చాలా కీలక అంశాలని ప్రస్తావించే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాలలో జనసేనాని చుట్టూ మీడియా చాలా ప్రశ్నలు సృష్టించి వదిలేసింది. అలాగే అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా జనసేన పవన్ కళ్యాణ్ సమాధానాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గ్లోబల్ సమ్మిట్ పై ఎలాంటి కామెంట్స్ చేయని జనసేనాని ఆవిర్భావ సభలో ఏమైనా ప్రస్తవిస్తారా అనేది ఆసక్తిగా మారింది. మరో వైపు టీడీపీ ఓ వైపు పవన్ కళ్యాణ్ తో పొత్తు అంటూనే కాపు నాయకులని మెల్లగా పార్టీలోకి లాగుతుంది. వారితో బలం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఇలా వ్యూహాత్మక విధానాలతో పవన్ కళ్యాణ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రజలు మాత్రం పవన్ కళ్యాణ్ సమాధానం కోసం, ఆయన చేసే కార్యాచరణ కోసం వేచి చూస్తున్నారు. దీంతో ఈ నాలుగు రోజులు మీడియాతో పాటు అన్ని పార్టీల దృష్టి పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఉంటుంది అనేది అందరూ చెప్పే మాట.