Akshay Kumar: హిందీలో గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న స్టార్ హీరోలలో వినిపించే మొదటి పేరు అక్షయ్ కుమార్. గత ఏడాది ఏకంగా ఆరు సినిమాలను రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్ ఈ ఏడాది కూడా అదే స్థాయిలో సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం అతని చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అయితే అక్షయ్ కుమార్ వరుసగా చేస్తున్న సినిమాలన్నీ కూడా డిజాస్టర్ అవుతున్నాయి. అయినా గాని గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ సర్కిల్లో ఇప్పుడు ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప2లో నటించబోతున్నాడు.
ఇందులో ఒక కీలక పాత్ర కోసం అక్షయ్ కుమార్ ను ఎంపిక చేసినట్లుగా ప్రచారం నడుస్తుంది. పుష్ప ఫ్రాంచైజీలు ఇంకా నెక్స్ట్ సిరీస్ కూడా కొనసాగించాలని సుకుమార్ భావిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్ట్ 2లో ఫహద్ ఫాజిల్ ను విలన్ గా కొనసాగిస్తున్నారు. ఇక దీనికి కొనసాగింపుగా ఉంటే పార్ట్ 3లో అక్షయ్ కుమార్ పాత్ర పవర్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ని మరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో సుకుమార్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.
అదే జరిగితే ఈ సినిమా రేంజ్ మరో లెవల్ కి వెళ్ళిపోతుందని మాట ఇప్పుడు గట్టిగా వినిపిస్తుంది. అయితే పుష్ప సీక్వెల్ లో నటించే వారి మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. గతంలో ఇతర స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు అక్షయ్ కుమార్ పేరు తెరపైకి రావడం సంచలనంగా మారింది. అయితే ఏప్రిల్ 8న పుష్ప సీక్వెల్ సంబంధించి ఫస్ట్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సుకుమార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అప్పటికి ఈ సినిమాలో క్యాస్టింగ్ ఎవరనేది ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.