Air Conditioning: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఉన్న కారులో ప్రయాణించిన లేదా ఆఫీసుకు వెళ్లిన తప్పనిసరిగా ఏసీలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలా చాలామంది ఏసీలో రోజంతా గడుపుతూ ఉంటారు ఒక్క క్షణం పాటు ఏసీ లేకపోయినా వారికి దిక్కు తోచదు.ఈ విధంగా ఏసీలో కనుక ఎక్కువ సమయం గడిపితే తప్పనిసరిగా కొన్ని వ్యాధుల బారిన పడాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ సమస్యలు ఏంటి అనే విషయానికి వస్తే…
మీరు ఎక్కువగా ఏసీలో కనుక గడుపుతూ ఉన్నట్లయితే మీ కళ్ళు తొందరగా పొడిబారి పోతాయి. దీంతో కళ్ళు మంటలు దురద ఏర్పడటం జరుగుతుంది. అయితే ముందుగానే ఈ సమస్యతో బాధపడే వారు ఏసీలో కనుక ఎక్కువ సమయం గడిపే ఈ సమస్య మరింత అధికమవుతుంది. డ్రై ఐ సిండ్రోమ్ ఉన్నవారు ఏసిలలో ఎక్కువ సమయం గడపకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఏసీలో గడిపేవారు డిహైడ్రేషన్ కి కూడా గురవుతూ ఉంటారు.
Air Conditioning:
సాధారణ గదిలో ఉండి పనిచేసే వారికి ఏసీ గదిలో ఉండి పనిచేసే వారికి ఎంతో వ్యత్యాసం ఉంటుంది ఏసీ గదిలో ఉండి పని చేసేవారు తొందరగా డిహైడ్రేషన్ కి గురి అవుతారు. AC.. గది నుంచి తేమను ఎక్కువగా పీల్చుకుంటే, మీరు డీ హైడ్రేషన్‌కు గురవుతారు. ఉష్ణోగ్రతలు తక్కువగా సెట్ చేసి పెట్టడమే కాకుండా నీళ్లను తరుచు తాగటం వల్ల ఈ సమస్యకు గురికాకుండా ఉండవచ్చు.ఏసీలు ఎక్కువ సమయం ఉన్నవారికి చర్మం త్వరగా పొడిబారుతుంది అందుకే మాయిశ్చరైజర్లు తప్పకుండా ఉపయోగించాల్సి ఉంటుంది అలాగే శ్వాస సంబంధిత సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి.ఇలా ఏసీ గదులలో ఉండేవారు ప్రతి రెండు గంటలకు ఒకసారి బయటకు వచ్చి పది నిమిషాలు బయట ఉండడం ఎంతో మంచిది.