Adivi Shesh : ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. వరుసపెట్టి మెస్ట్ వాంటెడ్ బ్యాచిలర్ హీరోలందరూ మూడుముళ్లతో వైవాహిక బంధంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే కుర్రహీరోలందరూ పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతున్నారు. రీసెంట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఐదేళ్లుగా ప్రేమించిన తన ప్రియురాలు నటి లావణ్యను పెళ్లి చేసుకుని ఇంటివాడయ్యాడు. ఇప్పుడు ఇదే క్రమంలో యంగ్ హీరో అడివి శేష్ పెళ్లికి రెడీ అయిపోయాడని తెలుస్తోంది. అడవి శేష్ వివాహానికి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ యంగ్ హీరో అక్కినేని ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి. టాలీవుడ్ మన్మథుడు నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డతో అడివి శేష్ ప్రేమలో ఉన్నాడని, రోజుకో వార్త పుట్టుకొస్తోంది. అయితే వీరి ప్రేమాయణంపై ఇరుకుటుంబాలు ఇప్పటి వరకు స్పందించకపోవడంతో మౌనం అర్థంగీకారం అని భావించేస్తున్నారు నెటిజన్స్.
అప్పట్లో అక్కినేని ఫ్యామిలీ ఫంక్షన్లలో, ప్రైవేట్ పార్టీలో ఎక్కువగా అడివి శేష్ కనిపించడమే ఇప్పుడు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. అయితే ఇంతాకాలం వీరిద్దరి గురించి తెలిసినా అక్కినేని ఫ్యామిలీ పెళ్లి విషయంలో తమ డెసిజన్ను హోల్డ్ లో పెట్టారని సమాచారం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అక్కినేని ఇంటివారు సుప్రియ విషయంలో తమ ఆలోచనను మార్చుకున్నట్లు తాజాగా తెలుస్తోంది. సుప్రియ రెండో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అంతే కాదు అడివి శేష్ పై పాజిటివ్ ఓపినీయన్ ఉండటంతో సుప్రియను అతడికి ఇచ్చి పెళ్లి చేస్తే లైఫ్ సెట్ అవుతుందని భావిస్తున్నారట. మరొకవైపు సుప్రియ, అడివి శేష్ లుకూడా వారి లైఫ్ పై ఫుల్ క్లారిటీతో ఉన్నారట. అందుకే వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవ్వాలని డిసైడ్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ నెల 22 న వీరిద్దరి ఎంగేజ్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ న్యూస్ లో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు ఈ విషయంపై అడివి శేష్ ఇటు సుప్రియ ఎవరు కూడా రియాక్ట్ కాలేదు. నిశ్చితార్థం రోజే తమ విషయం బయట పెడతారేమో. అయితే ఇది ఫేక్ న్యూస్ అయిన, కొంతమంది ఫ్యాన్స్ కావాలనే ఈ వార్తను స్ప్రెడ్ చేస్తున్నారని అంటున్నారు. ఏదిఏమైనా నిప్పు లేనిదే పొగ రాదు కదా, నిజంగా అలాంటిది ఏమీ లేకపోతే ఇంతలా వార్త ఎందుకు వైరల్ అవుతుంది అనేది మరికొంత మంది అంటున్నారు.
ఇదిలా ఉంటే అడవి శేష్ తన సినీ కెరీర్ లో వైవిధ్యమైన థ్రిల్లింగ్ కథలను ఎంచుకుంటూ విజయవంతంగా దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో సూపర్ డూపర్ హిట్ సాధించిన‘గూఢచారి’ సీక్వెల్ ‘గూఢచారి 2’ ను ప్రకటించారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ పాన్ ఇండియా మూవీని వినయ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ ని జరుపుకుంటోంది. తాజాగా షూటింగ్ స్టార్ట్ చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రీసెంట్ గానే మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. షూటింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో అడవి శేష్ ఫొటో ను ‘మన ఏజెంట్ మళ్లీ వచ్చాడని షేర్ చేశారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేసేందుకు మేర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.