Aditi Rao : కోలీవుడ్ హీరోయిన అదితి రావ్ హైదరీ, నటుడు సిద్దార్థ్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి స్నేహితులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ ఒక్క అనౌన్స్మెంట్తో వారి రిలేషన్ గురించి వస్తున్న పుకార్లకు అధికారికంగా చెక్ పెట్టారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ వనపర్తిలోని 400 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు అక్కడే వేడుక ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తాజాగా అదితి తెలిపింది. తను నటించిన హీరామండి వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో అదితి తన ఎంగెజ్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
గత నెలలో అదితి, సిద్దార్థ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న అత్యంత పురాతన శ్రీరంగపురం ఆలయంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుక జరిగే వరకు ఎవరికీ ఈ విషయం తెలియదు. ఇద్దరూ చాలా సీక్రెట్ గా తమ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నటి అదితి రావ్ హైదరీ వనపర్తి సంస్థానాధీశుల వారసురాలు. అందుకే ఆ గుడి పురోహితులు దగ్గరుండి మరీ ఈ వేడుకను సంప్రదాయ పద్ధతుల్లో జరిపించారు. నిశ్చితార్థం తర్వాత అదితి రావు రింగ్స్ తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అధికారికంగా తమకు ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిపింది. కానీ ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు.
రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నా తల్లి కోరిక మేరకే నేను నిశ్చితార్థం చేసుకున్నాను. నా ఎంగేజ్‌మెంట్ తర్వాత అమ్మకు చాలా కాల్ వచ్చాయి. నిజంగానే అదితి పెళ్లి చేసుకుందా అని అందరూ అమ్మ అడిగేవారు. అమ్మ ఆ కాల్స్ బాధ చూడలేక ఎంగేజ్మెంట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్పింది. దీంతో నేను, సిద్ధార్థ్ ఈ విషయంపై పోస్ట్‌లు పెట్టాం. నా నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో జరిగింది. ఆ గుడితో మా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది . అందుకే అక్కడ చేసుకున్నాను.