Adah Sharma : ‘ది కేరళ స్టోరీ’..అనూహ్యంగా 100 కోట్ల మార్క్ దాటిన చిన్న సినిమా. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఊహించని సక్సెస్ అందుకున్న సినిమా మరోటి లేదనే చెప్పాలి. అంతేకాదు, హీరోయిన్ అదా శర్మ కి గతకొన్నేళ్ళుగా మంచి అవకాశాలు దక్కడం లేదు. ఎట్టకేకలకి ‘ది కేరళ స్టోరీ’ ఛాన్స్ రావడం ఆ సినిమా భారీ హిట్ అందుకోవడం అలా జరిగిపోయాయి.
అయితే, కొన్ని సినిమాలు చేయడం వల్ల హీరోహీరోయిన్స్ నెటిజన్స్ నుంచి కొన్ని ప్రాంతీయవాదుల నుంచి, మతవాదుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆ మధ్య సమంత, సాయి పల్లవి, కశ్మీర్ ఫైల్స్ తీసిన చిత్ర దర్శకుడు సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ ఎదుర్కున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ‘ది కేరళ స్టోరీ’ మూవీ చేసిన అదా శర్మ అలాగే చిత్ర బృందం ట్రోల్స్ మాత్రమే కాకుండా బెదిరంపులు చూస్తున్నారు.
Adah Sharma : ప్రాణాపాయ స్థితిలో అదా శర్మ..
ఇటీవల ఈ మూవీ టీమ్ ని టార్గెట్ చేస్తూ కొందరు బెదిరించిన సంగతి తెలిసిందే. ఇవేవీ పట్టించుకోకుండా చిత్రబృందం సక్సెస్ టూర్ నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలో అనుకోకుండా ‘ది కేరళ స్టోరీ’ మూవీ యూనిట్ కి యాక్సిడెంట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హీరోయిన్ అదా శర్మకి మేకర్స్ కి బాగా దెబ్బలు తగిలాయాని ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని వార్తలు ప్రచారమవుతున్నాయి.
ఇది అదా శర్మకి తెలియడంతో తానే స్వయంగా స్పందించింది. ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. మేమందరం క్షేమంగానే ఉనాము. మాపై చూపించిన ప్రేమ, అభిమానాలకి ధన్యవాదములు. ఇది చిన్న యాక్సిడెంట్ మాత్రమే. ఎవరికీ ఏ హానీ జరగలేదు..అని ట్విట్టర్ పోస్ట్ లో తెలిపింది. దాంతో సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ కి అదా నేరుగా క్లారిటీ ఇచ్చినట్టైంది.