Actress Rambha: దర్శకనిర్మాతలకి సీనియర్ హీరోయిన్ రంభ పర్సనల్‌గా మెసేజ్ చేసిందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దివ్య భారతి నటించిన తొలిముద్దు సినిమాలో రంభ నటించింది. ఈ సినిమా షూటింగ్ పెండింగ్ ఉండగా దివ్య భారతి హఠాత్తుగా మృతి చెందింది. దాంతో అదే పోలికలతో ఉన్న రంభని పెట్టి మిగిలిన భాగం చిత్రీకరణ పూర్తి చేశారు. ఆ సినిమాలో పర్ఫార్మెన్స్ కి తెలుగు స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ ఆ ఒక్కటీ అడక్కు సినిమాతో హీరోయిన్‌గా పరిచయం చేశారు.
అచ్చ తెలుగమ్మాయి అయిన రంభ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుతుందని ఎవరూ ఊహించలేదు. కుర్ర హీరోలతో పాటు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, రాజశేఖర్, బాలకృష్ణ లాంటి అగ్ర హీరోల వరకూ సౌత్‌లో దాదాపు అందరితోనూ నటించింది. సీనియర్ దర్శకులు కె రాఘవేంద్ర రావు లాంటి వారితోనూ పనిచేసింది. రంభ లో ఉన్న మంచి గుణం అందరితో కలిసిపోవడం.
Actress Rambha: రంభకి అవకాశం కావాలి. నో చెప్పే ఛాన్సే లేదు.
సినిమా అంటే ప్రేమ. ఎలాంటి గ్లామర్ రోల్ అయినా చేసింది. రంగుల ప్రపంచం కాబట్టి అందాల ఆరబోతకి అడ్డు చెప్పలేదు. హీరోయిన్‌గా కెరీర్ కాస్త డౌన్ అవగానే ఎన్.టి.ఆర్ లాంటి హీరోల సినిమాలలో ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది. అంటే రంభకి అవకాశం కావాలి. నో చెప్పే ఛాన్సే లేదు. అయితే, పెళ్లైన తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేసింది.
మళ్ళీ ఇంతకాలానికి ఈ సీనియర్ నటీమణి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయాలనుకుంటుందట. ఈ నేపథ్యంలో తనకు బాగా సన్నిహితంగా ఉండే దర్శకనిర్మాతలకి పర్సనల్‌గా మెసేజెస్ చేస్తుందట. మంచి క్యారెక్టర్ అయితే మళ్ళీ నటించాలనుకుంటున్నాను..అంటు హింట్ ఇస్తుందట. అటువైపు నుంచి పాజిటివ్‌గానే రెస్పాన్స్ వస్తుందని సమాచారం. కాని, ఫ్యాన్స్ మాత్రం కొందరు రంభని అక్క, అమ్మ పాత్రలో చూడాలంటే ఇష్టపడటం లేదని తెలుస్తోంది.