Actress Pragathi : సోషల్ మీడియా వచ్చాక సినీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మొత్తం నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది. తారలు కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు సోషల్ మీడియకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు ఇంటర్నెట్ వేదికగా సినీ తరాల పర్సనల్ లైఫ్ కి సంబంధించి రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ హీరోయిన్ లవ్ బ్రేక్ అప్ అయ్యిందని, ఆ హీరో విడాకులు తీసుకున్నాడని, ఇలా నిత్యం ఏదో ఒక వార్త వస్తుంటుంది.తాజాగా అలాంటి ఓ రూమరే నటి ప్రగతి గురించి వైరల్ అవుతోంది. ప్రగతి రెండో పెళ్లి చేసుకుంటోందని న్యూస్ తెగ చెక్కర్లు కొడుతోంది. ఈ రూమర్ ప్రగతి చెవిలో పడడంతో, ఆమె వార్తను స్ప్రెడ్ చేసిన వారిపై ఓ రేంజ్ లో మండిపడిపోయింది.
నటి ప్రగతి సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన పర్సనల్ విషయాలను ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.అంతే కాదు తన మీద వచ్చే రూమర్లు, ట్రోలింగ్‌ను తన స్టైల్ లో తిప్పి కొడుతుంటుంది. తాజాగా ప్రగతి తన గురించి వచ్చిన రూమర్లు, వాటిని స్ప్రెడ్ చేసిన మీడియపైన ఫైర్ అయ్యింది..తన రెండో పెళ్లి గురించి వచ్చిన రూమర్లను ప్రగతి ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని అవన్నీ నిరాధారమైనవని తెలిపింది. ఏ వార్త అయినా ప్రూఫ్స్ ఉంటే రాయండి అని హితావు పలికింది. పెళ్లి చేసుకునేటట్లు ఉంటే నేనే ముందుగా చెబుతానంది.
” ఓ ప్రముఖ మీడియా సంస్థ ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేయడం బాధగా ఉంది. అక్కడ ఎంతో మంది చదువుకున్న వాళ్లుంటారు.నేను ఓ యాక్టర్ కాబట్టి.. ఏం రాసినా చెల్లుతుంది అని అనుకోవడం తప్పు. అసలు అలాంటి వార్త రాయడానికి మీకేం రైట్ ఉంది. ఎలాంటి ప్రూఫ్ లేకుండా అలా ఎలా రాస్తారు. నేను రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు మీకు ఏమైనా కల వచ్చిందా?.. నేను ఈ రూమర్ ను ఖండిస్తున్నా. ఏదైనా వార్త రాసేముందు కాస్త చెక్ చేయండి. అది నిజమో కాదో తెలుసుకోండి.. ఒకరి వ్యక్తిగత విషయాలు రాసే ముందు ఎంత వరకు రాయొచ్చు లిమిట్ తెలుసుకోండి.. ఆధారాలుంటే రాయండి. ఇది చాలా చీప్.. నా ఆత్మగౌరవాన్ని ఇలా దిగజార్చడం నాకు బాధగా ఉంది. ఇప్పటినుంచి అయినా ఇలా చేయకండి” అంటూ ప్రగతిమండిపడింది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.