Actress Mohini Chirstina: టాలీవుడ్‌లో ఒక కాలంలో స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకున్న నటి ఇప్పుడు క్రైస్తవ మత బోధకురాలిగా మారిపోయారు. సినిమాల్లో బాలనటిగా అడుగుపెట్టి, మెగా హీరో చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి అగ్ర నటులతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆమె.. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరంగా, అమెరికాలో క్రైస్తవ మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ కొత్త జీవనవిధానంలో కొనసాగుతోంది.
తమిళనాడులోని తంజావూర్‌కి చెందిన మోహినీ అలియాస్ మహాలక్ష్మి శ్రీనివాసన్, కెరీర్ ఆరంభంలోనే తన అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు. 1991లో తమిళ చిత్రం ఈరమన రోజావే ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన ఆమె, వెంటనే తెలుగులో ఆదిత్య 369లో బాలకృష్ణ సరసన నటించి మంచి గుర్తింపు పొందారు. అనంతరం డిటెక్టివ్ నారద, మామ బాగున్నావ్, హిట్లర్ వంటి హిట్లలో నటించి దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయారు.

Actress Mohini Chirstina: అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
వందకు పైగా సినిమాల్లో నటించిన మోహినీ, కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్లిపోయారు. అక్కడే ఇద్దరు పిల్లలకు తల్లయ్యారు. కొన్నాళ్లు సినిమాల్లో నటించినా, తరువాత పూర్తిగా విరమించారు. అంతలోనే భర్తతో విడాకులు తీసుకుని తాను జీవితాన్ని పూర్తిగా మతానికే అంకితం చేశారు. ప్రస్తుతం అమెరికాలో క్రైస్తవ మత ప్రచారకురాలిగా పలు ప్రోగ్రాముల్లో పాల్గొంటూ గడుపుతున్నారు.
ఇటీవల ఆమె వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు. అప్పట్లో స్లిమ్‌గా, గ్లామరస్‌గా కనిపించిన మోహినీ ప్రస్తుతం బొద్దుగా మారిన లుక్‌లో కనిపించారు. 2011లో వచ్చిన మలయాళ చిత్రం కలెక్టర్ ఆమె చివరి సినిమా. ఆ తరువాత మోహినీ సినిమాలకూ, స్క్రీన్‌కూ పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. వెండితెర సుడిగాళి నుంచి ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఒక బోధకురాలిగా మారారు.

