Thu. Feb 12th, 2026

    Sarath Babu : టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు (72) కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. గతకొంతకాలంగా ఆయ్న తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో కొన్నాళ్ళ క్రితం హైదరాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో చేరారు. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సమయంలో శరత్ బాబు చనిపోయారని తప్పుడు వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టి వైరల్ అయ్యాయి. ఇది పూర్తిగా అవాస్తవం అని శరత్ బాబు సోదరి ఈ వార్తలను ఖండించారు.

    కాగా, తాజా సమాచారం మేరకు శరత్ బాబు ఏఐజీలో చికిత్స పొందుతూ ఈరోజు (22.05.23) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో శరత్‌బాబు కన్నుమూసినట్టు హాస్పిటల్ వైద్యులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో శరత్ బాబు జన్మించారు. ముందు నాటకాలలో కొన్ని పాత్రలను పోషించారు.

    actor-sarath-babu-no-more
    actor-sarath-babu-no-more

    Sarath Babu : ఆఖరి చిత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్.

    వాటి ద్వారా సినిమాలలో నటించే అవకాశం అందుకున్నారు శరత్ బాబు. 1973లో వచ్చిన రామరాజ్యం ఆయన హీరోగా నటించిన మొదటి సినిమా. ఈ సినిమా తర్వాత అటు హీరోగా నటిస్తూనే విలన్ వేశాలు..చక్కటి క్యారెక్టర్స్ పోషించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాధించుకున్నారు. మళ్ళీ పెళ్ళి. ఈ నెల 26 న రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాత ఎమ్ ఎస్ రాజు స్వీయ దర్శకత్వంలో రూపొందగా, సీనియర్ నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.