Health Tips: సాధారణంగా పిల్లలు చాలా చురుగ్గా ఆడుకుంటూ ఆటపాటలతో సందడి చేస్తుంటారు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం ఇతర పిల్లలతో కలవకుండా వారు ఒక్కరే సపరేట్ గా ఉంటూ వారి లోకంలో వారు ఉంటారు. ఇతర పిల్లలతో కలిసి ఆడుకోవడానికి ఆసక్తి చూపించరు. ఎప్పుడు కూడా వారి పరధ్యానంలో వాళ్లు ఉంటారు.ఇలా పిల్లలు చురుగ్గా లేకుండా కేవలం మంచానికి మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు అంటే వారి డైట్ లో తప్పనిసరిగా ఈ స్మూతీ చేర్చాల్సిందే. ఈ స్మూతీ ప్రతిరోజు పిల్లలకు ఇవ్వటం వల్ల ప్రోటీన్లతో పాటు ఇతర పోషకాలు కూడా వారికి అందరమే కాకుండా వారిలో ఎంతో చురుకుదనం చలాకితనం ఉంటుంది. మరి ఆ స్మూతీ ఏంటి అనే విషయాన్ని వస్తే…
ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ నీటిని మరిగించుకోవాలి. ఈ గ్లాస్ నీరు మరిగేలోపు మరొక గ్లాస్ లో రెండు చెంచాల రాగి పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.ఇలా ఈ కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్ పై ఉంచినటువంటి నీరు మరిగిన తర్వాత అందులో వేసి సిమ్ లో దాదాపు పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. అనంతరం దీనిలోకి ఫూల్ మఖానా వేసుకోవాలి. అలాగే ముందుగా తయారు చేసి పెట్టుకున్న రాగి మిశ్రమం, ఐదు గింజ తొలగించిన ఖర్జూరాలు, అరకప్పు ఆపిల్ ముక్కలు, అర గ్లాస్ హోం మేడ్ బాదంపాలు, పావు టేబుల్ స్పూన్ ఏలకుల పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తద్వారా ఫూల్ మఖానా రాగి స్మూతీ సిద్ధం అవుతుంది. ఈ స్మూతీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Health Tips:
ముఖ్యంగా పిల్లల రెగ్యులర్ డైట్ లో ఈ స్మూతీ ఇవ్వటం వల్ల వారి శరీరానికి కావాల్సిన పోషకాలని కూడా సమృద్ధిగా లభిస్తాయి తద్వారా పిల్లల చలాకితనం మొదలవుతుంది. అందరిలాగే ఇతర పిల్లలతో కలిసి ఆటపాటలలో పాల్గొంటూ చాలా చురుగ్గా ఉంటారు అలాగే వీరి జ్ఞాపకశక్తి కూడా పెంపొందుతుంది. ఈ స్మూతీ ప్రతిరోజు తీసుకోవడం వల్ల శారీరక మరియు మానసిక ఎదుగుదల అద్భుతంగా సాగుతుంది. అంతేకాదు పిల్లల డైట్ లో ఈ స్మూతీని చేరిస్తే రక్తహీనత దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.