Wed. Jan 21st, 2026

    Devotional Tips: జీవితమన్న తర్వాత ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఇబ్బందులను ఎదుర్కొని ముందుకు సాగినప్పుడే మన జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అయితే చాలామంది మాత్రం ఎదుర్కొనే ఇబ్బందులలో ఆర్థిక సమస్యలు ఒకటి. చాలామంది ఎంత కష్టపడి పనిచేసిన చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ సమస్యల నుంచి బయటపడటానికి ఎన్నో పరిహారాలు పాటిస్తూ ఉంటారు. అయితే ఇలా ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు ఎలాంటి సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు.

     

    లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉండాలి అంటే ప్రతి పౌర్ణమి రోజు రాత్రి ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీ సహస్రనామాలను చదవటం వల్ల అమ్మవారి అనుగ్రహం మనపై ఉండి ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లక్ష్మీ కటాక్షాన్ని కలిగిస్తుందని చెప్పాలి. ఇలా పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు మన దరికి చేరకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పండితులు చెబుతున్నారు.

    Devotional Tips:

    శుక్రవారం సూర్యాస్తమ సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అలాగే అమ్మవారికి ప్రత్యేక పువ్వులతో అలంకరించి పూజించాలి. ఆవు పాలు బెల్లం తో తయారు చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అనంతరం రాగితో తయారుచేసిన శ్రీ యంత్రాన్ని పూజలో ఉంచుకొని పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. ఇక లక్ష్మి దేవితో పాటు సంపదకు మూలకారకుడైన కుబేరుడిని కూడా పూజించడం ఎంతో మంచిది.