AP Politics: ఏపీలో అధికార పార్టీ వైసీపీ నాలుగేళ్ల పాలనని పూర్తి చేసుకుంది. ఇన్నేళ్ళ పాలనలో వైసీపీ నుంచి ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా భాగానే లబ్ది పొందారు. ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఏడాది డబ్బులు అందేలా వైఎస్ జగన్ ప్రణాలికలు వేసుకొని ముందుకి వెళ్తున్నారు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఎక్కడ లేని డబ్బు మొత్తం తీసుకొచ్చి పెడుతున్నారు. దీంతో సంక్షేమ పథకాలతో ప్రజలలో ముఖ్యంగా మహిళలకి సాయంగా డబ్బులు ఇస్తూ ఉండటంతో అది మళ్ళీ తమని అధికారంలోకి తీసుకొస్తుందని జగన్ బలంగా నమ్ముతున్నారు. అందుకే మంచి జరిగింది అంటేనే తనకు ఓటు వేయండి. ప్రతిపక్షాల కుట్రలని నమ్మకండి అంటూ ప్రతి మీటింగ్ లో చెబుతున్నారు.
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ కి ఉన్నపళంగా ఢిల్లీ రమ్మని కబురు పెట్టిందంట. దీనికి బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కేంద్రంలో పెద్దలతో మాట్లాడుతూ ముందస్తు ఎన్నికలకి సహకరించాలని కోరుతున్నారంట. వారి సహకారం లేకుండా ముందస్తుకి వెళ్ళడం కష్టం అని భావించి సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముందస్తుకి వెళ్ళాలంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆరు నెలల్లో ఎన్నికలకి వెళ్ళాలి. అయితే కేంద్రం వద్దు అనుకుంటే రాష్ట్రపతి పాలన పెట్టె అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో తెలంగాణతో పాటుగానే డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రాన్ని జగన్ కోరుతున్నారని టాక్. ఈ కారణంగానే క్యాబినెట్ బేటీకి హాజరు కావాలని జగన్ కి కేంద్రంలోకి బీజేపీ పెద్దలు సందేశం పంపించారంట. చాలా రోజుల నుంచి ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్ష పార్టీలు చెబుతూనే ఉన్నాయి. అయితే ముందస్తుకి వెళ్ళే ఛాన్స్ లేదని జగన్ పదే పదే చెబుతున్న పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకి స్పష్టమైన దిశానిర్దేశం చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా తాము ఎప్పుడు ఎన్నికలు వచ్చిన సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు ఇస్తున్నారు.