Lord Shiva: సాధారణంగా మనం ఏదైనా దేవుని ఆలయాలకు వెళ్తే సరాసరి గర్భగుడిలోకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకుంటాము అయితే ఒక శివాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ముందుగా మనము శివలింగం ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడిని దర్శనం చేసుకొని అనంతరం గర్భగుడిలోకి వెళ్లి లింగాన్ని దర్శించుకుంటాము.ఇక మనం ఏ ఆలయానికి వెళ్లిన శివలింగం ముందు నందీశ్వరుడు తప్పకుండా కనిపిస్తారు. అలాగే పరమేశ్వరుడు మనకు లింగ రూపంలోనే దర్శనమిస్తాడు కానీ ఎక్కడ కూడా విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వడు.
ఇక శివాలయానికి వెళ్ళిన తర్వాత నంది కొమ్ముల్లో నుంచి పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే… పరమేశ్వరుడు లయకారుడు త్రిమూర్తులలో ఒకరైన ఈయన అత్యంత శక్తివంతమైన దేవుడు.ఇంత శక్తివంతమైనటువంటి శివయ్యను నేరుగా చూడకుండా ఇలా నందీశ్వరుడి కొమ్మలలో నుంచి దర్శించుకొని అనంతరం గర్భగుడిలోకి వెళ్లి దర్శించుకుంటారు.
Lord Shiva:
ఇక నంది కొమ్మలపై కుడి చేతి వేళ్లను పెట్టి,ఎడమ చేతితో నంది వీపుపై నిమృతం శివయ్యను దర్శించుకోవాలి అనంతరం నందీశ్వరుడు చెవిలో మన గోత్రం ఇంటి పేరు కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి మన కరికను చెబితే ఆ కోరిక నెరవేరుతుంది భావిస్తారు.అందుకే పరమేశ్వరుడిని దర్శించుకునే సమయంలో ముందుగా నందీశ్వరుడిని దర్శనం చేసుకోవాలి అనంతరం శివయ్య దర్శనం చేసుకోవడం వల్ల అన్ని శుభ పరిణామాలు కలుగుతాయి.