Inter Student Record : కార్పొరేట్ స్కూల్స్ లో చదువు. లక్షలకు లక్షలు ఫీజులు. ప్రత్యేకంగా ట్యూషన్ లు. స్పెషల్ కేర్. డైట్లు వారి అడిగిందల్లా కొనిచినప్పటికీ చాలామంది విద్యార్థులు అత్యసరు మార్కులతో పాస్ అవుతుంటారు. కానీ తమిళనాడుకు చెందిన ఓ విద్యార్థి మాత్రం ఇవేమీ లేకుండానే నేడు స్టేట్లోనే టాప్ ర్యాంకర్ నిలిచింది. తండ్రి పడుతున్న కష్టం తల్లి చూపించిన ప్రేమనే ఈ విద్యార్థి తన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకునేలా చేసేది. తమిళనాడుకు చెందిన ఇంటర్ సెకండియర్ విద్యార్థి గతంలో ఎన్నడూ లేని విధంగా 600 మార్కులకు 600 మార్కులు సాధించి నేడు అందరిని అవాక్కు చేస్తోంది. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది.
తమిళనాడు ప్రభుత్వం తాజాగా ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో దిండిగల్ పట్టణంలోని నాగల్ నగర్ లో ఉంటున్న నందిని 600 మార్కులకు 600 మార్కులు సాధించి రికార్డ్ సృష్టించింది. దిండిగల్ లోని అన్నామలయార్ మిల్స్ గర్ల్స్ హైయర్ సెకండరీ స్కూల్లో ఇంటర్ చదువుతోంది నందిని. తమిళం ఇంగ్లీష్,ఎకనామిక్స్,కామర్స్, అకౌంట్స్,కంప్యూటర్స్ ఈ ఆరు సబ్జెక్టులలో వందకి వంద మార్కులు సాధించి టోటల్ రౌండ్ ఫిగర్ 600 మార్కులు సాధించింది.
టాపర్ గా నిలవడంతో నందిని చాలా సంతోషంగా ఉంది. తన నాన్న ప్రోత్సాహంతోనే ఇంతటి విజయాన్ని సాధించానని చెప్పుకొస్తుంది. ” నాన్న ఒక కార్పెంటర్ నన్ను చదివించడానికి ఆయన చాలా కష్టపడ్డారు. అమ్మ ఇంట్లోనే ఉంటూ నాకు కావాల్సిందల్లా చేసి పెట్టింది.అమ్మ ప్రేమ నాన్న కష్టం ఈ రెండు నన్ను ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రోత్సహించాయి. నాకు నేనే సొంతంగా టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. సబ్జెక్టుల వారిగా ప్రణాళిక బద్దంగా చదువు కుంటూ వచ్చాను. అది నా సక్సెస్ సీక్రెట్ అంటుంది స్టూడెంట్ విద్యార్థి సాధించిన మార్కులకు ఆమె ఉపాధ్యాయులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే కాదు పొలిటికల్ లీడర్స్ కూడా నందినిని మెచ్చుకున్నారు. తమిళనాడు సీఎం కొడుకు ఉదయనిధి నందినిని కలిసి అభినందించారు.