Banana: కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో మనకి దొరికి పండ్లలో అరటిపండు ఒకటి. అందుకే అరటిపండ్లు సంవత్సరం పొడుగునా మనం తినవచ్చు.
అరటిపండును రోజువారి డైట్ లో తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్స్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫైబర్, అమైనో ఆమ్లాలు, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, మాంగనీస్ వంటి సహజ పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి కావున మనలో పోషకాహార లోపం తొలగిపోయి వ్యాధి నిరోధక శక్తి పెంపొందడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
ఇలా ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి అరటిపండును ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు తలెత్తవా అనే విషయానికి వస్తే..
అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు రోజువారి డైట్ లో అరటిపండును తీసుకుంటే ఇందులో సమృద్ధిగా ఉండే పొటాషియం రక్తనాళాలను శుద్ధిచేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అరటిపండును ఆహారంగా తీసుకుంటే డయాబెటిస్ వ్యాధిని కూడా నియంత్రణలో ఉంచవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
Banana:
డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు బాగా పండిన అరటిపండును తినకూడదు. అల్సర్ సమస్యతో బాధపడేవారు భోజనం తిన్న వెంటనే అరటిపండును ఆహారంగా తీసుకుంటే కడుపులో మంట, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు రోజువారి డైట్ లో అరటిపండును తీసుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్లు తొలగిపోయి కిడ్నీ సామర్థ్యం మెరుగు పడుతుంది. ఇలా ప్రతిరోజు అరటిపండు తినడం వల్ల ఈ విధమైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నింటిని కూడా మనం పొందవచ్చు.