Vastu Tips: మన హిందూ సాంప్రదాయాలలో చీపురుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంటిని శుభ్రం చేసే చీపురు గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని విశేషాలు చెప్పబడ్డాయి. మనం ఇంటిని నిర్మించే సమయంలో, అలాగే ఇంట్లో పెట్టుకునే వస్తువులు విషయంలో వాస్తు శాస్త్రాన్ని పాటిస్తూ వాస్తు నియమాలకు అనుగుణంగా ఇంటిని, ఇంట్లో ఉన్న వస్తువులను పెట్టుకుంటాం. అదేవిధంగా ఇంటిని శుభ్రం చేసే చీపురు విషయంలో కూడా కొన్ని వాస్తు నియమాలు తప్పక పాటించాలి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును మహాలక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. అందువల్ల చీపురును ఎక్కడపడితే అక్కడ ,ఎలా పడితే అలా పెట్టకూడదు. అంతే కాకుండా చీపురును ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి తెచ్చుకోకూడదు. ఇంట్లో ఈశాన్యం మూల, ఆగ్నేయ మూలలో పొరపాటున కూడా చీపురును ఉంచకూడదు. ఎల్లప్పుడూ నైరుతి, వాయువ్య మూలలో మాత్రమే చీపురును కనిపించకుండా పెట్టాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో చీపురు పాడైపోయినప్పుడు కొత్త చీపురు కోనుగోలు చేసే సమయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి.
Vastu Tips:
ఇంట్లోకి కొత్త చీపురును కొనుగోలు చేయాలనుకునే వారు ఎప్పుడు పడితే అప్పుడు కొత్త చీపురును కొనుగోలు చేయకూడదు. వాస్తు నియమాల ప్రకారం శనివారం నాడు కొత్త చీపురును కొనుగోలు చేసుకొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదని చెబుతున్నారు. అలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఇంట్లో సిరి సంపదలు చేకూరుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే శుక్రవారం నాడు, మంగళవారం నాడు, మహాలయ పక్షం సమయాల్లో అంటే భాద్రపద మాసంలోని పౌర్ణమి నుంచి అమావాస్య రోజుల్లో చీపురును కొనుగోలు చేయడం ఏ విధంగానూ మంచిది కాదని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది .