Sarath Babu : గత ఏడాది నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటి నటులు..మిగతా క్రాఫ్ట్స్ కి చెందినవారు కన్నుమూసిన సంగతి తెలిసిందే. వారిలో ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు లాంటి అగ్ర తారలుండటం ఆసక్తికరమైన విషయం. అయితే ఆ జనరేషన్‌కి సంబంధించిన మరో నటుడు శరత్ బాబు కూడా అనారోగ్యంతో బాధపడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం శరత్ బాబు వయసు 71 సంవత్సరాలు. ఆయన హీరోగా, సహాయ నటుడిగా ఎన్నో గొప్ప పాత్రలను చేసి తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక తాజా సమాచారం మేరకు శరత్ బాబు అవయవాల వైఫల్యం అంటే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్..(ఒకేసారి శరీరంలో చాలా భాగాలు దెబ్బతినడం) కారణంగా ఆసుపత్రిలో చేరారు. గత ఆదివారం రోజున ఆయన పరిస్థితి విషమించడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
Sarath Babu : ఆర్గాన్స్ ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పోరాట ప్రక్రియలు
శరత్ బాబు గతవారం బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయ్న పరిస్థితి కాస్త సీరియస్‌గానే ఉన్నట్టు వైద్యుల నివేదిక ద్వారా తెలుస్తోంది.. శరత్ బాబుకు గతకొంతకాలంగా సెప్సిస్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇది మూత్రపిండాలు.. ఊపిరితిత్తులు.. కాలేయంతో పాటుగా ఇతర అవయవాల పనితీరు మీద తీవ్రంగా ప్రభావం చూపింది. సెప్సిస్ వల్ల శరీరం సరిగ్గా స్పందించదు. ఆర్గాన్స్ ఇన్ఫెక్షన్ కి వ్యతిరేకంగా పోరాట ప్రక్రియలు స్తంభించిపోతాయి.
ప్రస్తుతం శరత్ బాబును ఆసుపత్రిలో వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారట. ఆయన ఆస్పత్రిలో చేరడం ఇది రెండవసారి. కొన్ని వారాల క్రితం.. చెన్నైలోని ఆసుపత్రిలో చేరారు. కాగా, తెలుగు..తమిళం భాషలలో ఎన్నో గొప్ప పాత్రలను పోషించారు. 1973లో రామరాజ్యం అనే తెలుగు సినిమాతో నటుడిగా సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చారు. 1977లో ప్రముఖ దర్శకుడు కె బాలచందర్ రూపొందించిన ‘పట్టిన ప్రవేశం’ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.