Chandrababu: ఏపీలో 40ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతగా, టీడీపీ అధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు తరువాత విభజన ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఇలా ఏపీలో మూడు సార్లు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఒకే ఒక్క నాయకుడుగా చంద్రబాబు నిలిచారు. అలాగే సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రి హోదా ఏపీని రూల్ చేసిన నాయకుడిగా కూడా చంద్రబాబు తనదైన ముద్ర వేశారు. ఏపీ అభివృద్ధిలో చంద్రబాబు ప్రస్థానం చాలా కీలకం అని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ లో ఐటీ రంగం అభివృద్ధి దేశంలోనే టాప్ లో ఉంది.
ఈ స్థాయిలో ఐటీ రంగం అభవృద్ధి జరిగింది అంటే చంద్రబాబు తీసుకొచ్చిన సంస్కరణలు అని చెప్పాలి. అంతర్జాతీయంగా హైదరాబాద్ పేరు ప్రస్తుతం వినిపిస్తోంది అంటే కచ్చితంగా అందులో బాబు ప్రస్తావన ఉంటుంది. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఏపీలో కొనసాగుతోన్న చంద్రబాబు తెలుగుదేశం పార్టీ స్థాయిని పెంచడంలో కూడా ప్రధాన పాత్ర పోషించారు. నాయకుడిగా కంటే అడ్మినిస్ట్రేటివ్ గా చంద్రబాబు గురించి రాజకీయ విశ్లేషకులు గొప్పగా చెబుతూ ఉంటారు. టీమ్ మేనేజ్మెంట్ లో చంద్రబాబుని మించిన వారు ఉండరని అంటారు. అలాగే అభినవ చానిక్యుడుగా కూడా బాబు గురించి అభివర్ణిస్తూ ఉంటారు.
క్రిందికి పడిపోయారు అనుకునే ప్రతిసారి తన చానిక్య వ్యూహాలతో మరల తెలుగుదేశం పార్టీని బలమైన రాజకీయ శక్తిగా ప్రాజెక్ట్ చేస్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఇప్పుడు జగన్ రూపంలో చంద్రబాబుకి బలమైన ప్రత్యర్ధులు ఉన్నారు. వారిని దీటుగా ఎదుర్కొంటూ తన రాజకీయ వ్యూహాలతో చంద్రబాబు నిద్ర లేకుండా చేస్తున్నారు. ఏపీలో పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్నాడు అని అందరూ భావిస్తున్న తరుణంలో అతనికి లభించిన పాజిటివ్ వైబ్ ని తనకి అనుకూలంగా చంద్రబాబు మార్చుకున్నారు. టీడీపీతో విభేదించి దూరమైనా పవన్ కళ్యాణ్ మరల అదే టీడీపీతో ఇప్పుడు పొత్తు పెట్టుకొని రాజకీయంగా నిలబడాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో కూడా చంద్రబాబు చాణిక్యం ఉందని చెప్పాలి.