Asthma: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఎక్కువగా వేధిస్తున్న సమస్యలను ఆస్తమా సమస్య కూడా ఒకటి. ఈ ఆస్తమా సమస్యను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు మీదికి వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఈ సమస్య నుండి విముక్తి పొందటానికి వేల రూపాయల ఖర్చు చేసి హాస్పిటల్లో చుట్టూ తిరగనవసరం లేకుండా మన ఇంట్లో లభించే కొన్ని పదార్థాలతో చిట్కాలు పాటించటం వల్ల ఆస్తమా సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఆస్తమా సమస్యను నిర్మూలించే చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మన ఇంట్లో ఉండే మసాలా దినుసులలో మిరియాలు లవంగాలు కూడా ఒకటే. వీటిలో ఎన్నో ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి. అందువల్ల వీటిని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వినియోగిస్తారు. ఇక మిరియాలు లవంగాలు ఉపయోగించి ఆస్తమా సమస్యకు చెక్ పెట్టి రెమిడీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. రెమిడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాసు నీటిని పోసి బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఆరు లేదా ఏడు మిర్యాల గింజలు, ఐదు లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ తో ఐదు తులసి ఆకులను శుభ్రంగా కడిగి నీటిలో వేసి బాగా మరిగించాలి.
Asthma:
ఆ మొత్తం నీరు బాగా మరిగి సగం గ్లాసు నీరు అయ్యేవరకు బాగా మరిగించాలి. ఆ తర్వాత వాటిని కొద్దిగా చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేరొక గ్లాసులోకి వడపోసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని తాగాలి. ఇలా ప్రతిరోజు ఉదయం ఈ నీటిని తాగటం వల్ల ఆస్తమా సమస్య నుండి క్రమక్రమంగా విముక్తి పొందవచ్చు. ఈ నీటిని తాగటం వల్ల ఇతర శ్వాస సంబంధిత సమస్యలు కూడా తలెత్తకుండా ఉంటాయి.