Devotional Tips: మన సనాతన ధర్మంలో కొన్ని రకాల మొక్కలకు కూడా ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అటువంటి మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ప్రతి ఇంట్లోనూ తులసి మొక్క ఉంచి ప్రతిరోజు ఉదయం,సాయంత్రం క్రమంలో తప్పకుండా ఎంతో భక్తి తో పూజలు చేస్తూ ఉంటారు. ఇలా తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించటం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఆమె అనుగ్రహం మనకు లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా తులసి ఆకులతో కొన్ని రకాల చిట్కాలు పాటించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారు ఆ సమస్యల నుండి విముక్తి పొందటానికి తులసి ఆకులతో ఈ పరిహారం చేయటం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి 11 తులసి ఆకులను తీసుకొని వాటిని బాగా కడిగి కొంత సమయం ఎండలో ఆరబెట్టాలి. ఆ తర్వాత సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి. ఆ ఆకులన్నింటితో ఒక మాల తయారుచేసి ఆ మాలను ఆంజనేయ స్వామికి సమర్పించాలి. ఇలా చేయడంవల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగడమే కాకుండా కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయి
Devotional Tips:
అలాగే తులసి ఆకులను ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పూజ గదిలో ఉంచి వాటి మీద కొంచెం కుంకుమ పసుపు వేసి లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచాలి. పూజ ముగిసిన ఆ ఎరుపు రంగు వస్త్రాన్ని ముడి వేసి మీ పర్సు లేదా డబ్బులుంచే అల్మారాలో పెట్టాలి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కొందరు ఏ పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి సమయంలో నాలుగైదు తులసి ఆకులను శుభ్రం చేసి వాటిని నీటితో నింపిన ఇత్తడిపాత్రలో వేయాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తితో పోయి సానుకూల శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఆ నీటిని ఇంటి గుమ్మంమీద, ఇతర ప్రదేశాల్లో తులసి ఆకులతో చల్లుకోవాలి.