Wed. Jan 21st, 2026

    YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసీపీ మరల ప్రజాక్షేత్రంలోకి వెళ్లి జగనన్నే మా భవిష్యత్తు అనే నినాదంతో ప్రచార వ్యూహాలని సిద్ధం చేసుకుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన నాయకులు ఎవరైనా నేను మీకు భరోసా ఇస్తా అని హామీలు ఇస్తారు. కాని ప్రజలు మాత్రం జగనన్న లేకపోతే మాకు దిక్కులేదు అని అడుక్కోవాలని వైసీపీ అధిష్టానం తన క్యాంపెయిన్ ద్వారా సూచిస్తున్నట్లు ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ఆత్మవిశ్వాసం ఉండటం సహజం. అయితే ఆ ఆత్మ విశ్వాసంలో అప్పుడప్పుడు కొన్ని వాస్తవాలు వదిలేస్తారు. చుట్టూ ఉండే కోటరీలో ముఖ్యమంత్రులుగా ఉన్నవారు నిజంగా ప్రజలలో తమ పట్ల అద్భుతమైన ఆదరణ ఉందనే అనుకుంటారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలతో డబ్బులు ఇస్తున్నాం కాబట్టి ప్రజలు తమకి ఓట్లు వేసేస్తారు అని భ్రమలో ఉన్నారు.

    AP YSR Jagananna Colonies 2023: Online Application, Registration, Eligibility & Benefits

    అయితే వాస్తవంగా గ్రౌండ్ లెవల్ లో ఉన్న వ్యతిరేకత గ్రహించలేదు. దీంతో ఊహించని స్థాయిలో ఓటమిని మూటగట్టుకుంది. పవన్ కళ్యాణ్ ని దూరం చూసుకోవడం ద్వారా చేసిన తప్పుని టీడీపీ గ్రహించలేదు. అందుకే ఓట్లు భారీగా చీలిపోయి ఏకంగా 60 స్థానాల వరకు తక్కువ మెజారిటీతో వైసీపీ గెలిచింది. ఇదిలా ఉంటే ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ కూడా సంక్షేమ పథకాల పేరుతో నిత్యం ప్రజల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది. అయితే ఈ డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్న జనం తమకి ఓట్లు వేస్తారనే ఆలోచనతోనే జగన్ ఉన్నారు. అయితే సంక్షేమంతో ఇచ్చే సొమ్ములు వారి రోజు వారి ఖర్చులకి మాత్రమే వస్తాయి. రోజు గవడానికి ఆ డబ్బులు సరిపోవు. కచ్చితంగా ఉపాధి, ఉద్యోగాలతో అభివృద్ధి ఉండాలి.

    YS Jagan launches Jagananna Sampoorna Gruha Hakku scheme in Tanuku | Andhra Samachar

    ఉపాధి మార్గాలు చూపించే ప్రయత్నం చేయాలి. అలాగే రవాణా వ్యవస్థ. కనీస మౌలిక వసతుల కల్పన వంటివి ప్రాధాన్య అంశాలుగా ఉండాలి. నిత్య అవసరాలైన నీరు, కరెంట్, పప్పులు, ఉప్పులు సౌలభ్యమైన ధరలలో ఉండాలి. ఇలా ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు. అప్పుడే అధికారంలో ఉన్నవారికి వారు తిరిగి ఓటు వేస్తారు. అయితే వైసీపీ పాలనలో ప్రధానంగా కొరవడింది అదే. కనీసం గట్టిగా ప్రశ్నించే హక్కు కూడా ప్రజలకి లేదు. మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. సొంత పార్టీ నేతలే ఈ విమర్శలు చేస్తూ ఉండటం విశేషం.

    అలాగే పంచాయితీ సర్పంచ్ లు ఏ పార్టీకి అయిన బలం. కాని ఆ పంచాయితీ సర్పంచ్ ల వ్యవస్థని వైసీపీ సర్కార్ పూర్తిగా నిర్వీర్యం చేసేసింది. ఇవన్ని కూడా గ్రౌండ్ లెవల్ లో అధికార పార్టీ మీద వ్యతిరేకత పెంచేవి కావడం విశేషం. గ్రౌండ్ లెవల్ రిపోర్ట్ పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ప్రచారాలు, స్టిక్కర్లతో ఇంటింటికి ప్రచారం చేయడం వలన ప్రయోజనం ఏమి ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకుల మాట. మరి ఈ సంక్షేమమే గెలిపిస్తే రోడ్ల మీదకి ఎమ్మెల్యేలు వచ్చి తిరగాల్సిన అవసరం ఏముంది అనేది కూడా ప్రశ్నగా ఉంది. మరి ప్రజాక్షేత్రంలో అధికార పార్టీ ప్రజా అసంతృప్తిని తగ్గించి అధికారంలోకి వస్తుందా అనేది చూడాలి.