Health Tips: సాధారణంగా నిద్రించే సమయంలో చాలామందికి గురకపెట్టే అలవాటు ఉంటుంది. ఈ అలవాటుని చాలామంది తేలికగా తీసుకుంటారు. అయితే అతిగా గురకపెట్టే అలవాటు ప్రమాదానికి దారితీస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. సరైన సమయంలో దీనికి చికిత్స తీసుకోకపోతే అనేక వ్యాధులు సంభవించే ప్రమాదం ఉంటుందని డాక్టర్లు వెల్లడించారు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ అలసట వల్ల నిద్రించే సమయంలో గురక వస్తుంది. అయితే నిశబ్దంగా నిద్రించే వారితో పోలిస్తే గురక పెట్టే వారికి స్ట్రోక్ వచ్చే అవకాశం రెండింతలు ఉంటుందని ఒక అధ్యయనం సూచిస్తుంది. ఇటీవల ఐరిష్ పరిశోధకులు చేసిన పరిశోధనలలో ఈ విషయం వెల్లడయ్యింది.
నిద్ర లేమి సమస్యలు వ్యక్తికి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని వైద్యులు సూచిస్తున్నారు. న్యూరాలజీలో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం నిద్రకు సంబంధించిన సమస్యలు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనంలో వెళ్ళడయ్యింది. రోజులో ఐదు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోయే వారికి ఇతర సమస్యలతో పాటు స్ట్రోక్ వచ్చే సమస్యలు కూడా అధికంగా ఉంటాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు 7 గంటల పాటు నిద్రపోయే వారిని వారితో ఐదు గంటలు నిద్రపోయే వారిని పోల్చితే .. తక్కువ సమయం నిద్రపోయే వారిలో పక్షవాతం వచ్చే అవకాశం 3 రెట్లు ఎక్కువని రుజువయింది.
Health Tips:
అలాగే స్లీప్ అప్నియా (నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది) ఉన్నవారికి కూడా స్ట్రోక్ వచ్చే అవకాశం మూడు రెట్లు ఎక్కువని అధ్యయనంలో వెల్లడైంది. అందువల్ల ఈ ప్రమాదం నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతే కాకుండా నిద్ర విధానాలను మెరుగుపరచడం వల్ల స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చని డాక్టర్లు వెల్లడించారు. అందువల్ల ప్రతిరోజు తగినంత సమయం ప్రశాంతంగా నిద్రపోవాలి. అలాగే నిద్రలో గురకపెట్టే అలవాటు ఉన్నవారు కూడా ఒకసారి డాక్టర్ని సంప్రదించి సరైన సమయంలో చికిత్స తీసుకోవటం ఎంతో అవసరం.