Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో మెయిన్ పిల్లర్ గా ప్రస్తుతం ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికలలో బలమైన స్థానాలలో గెలిచి కచ్చితంగా అధికారంలో భాగస్వామ్యం కావాలని జనసేనాని భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేయడానికి ఏం చేయాలో అలాంటి వ్యూహాలు అన్ని వేసుకుంటూ ప్రజాక్షేత్రంలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ వైపు జగన్ తాడేపల్లిలో మంత్రులు, ఎమ్మెల్యేలు అందరితో భేటీ కాబోతున్నారు. ప్రజాక్షేత్రంలోకి రానున్న రోజుల్లో ఎలా వెళ్ళాలి అనే విషయాలపై చర్చించబోతున్నట్లుగా ప్రచారం నడుస్తుంది.
అలాగే ఇద్దరు, ముగ్గురు మంత్రులని కూడా తొలగించే యోచనలో ఉన్నారని వినికిడి. దాంతో పాటు సీట్లు రాని ఎమ్మెల్యేలకి కూడా స్పష్టంగా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. ఇలా అధికార పార్టీ వైసీపీ రాజకీయ కార్యాచరణని సిద్ధం చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇదే సమయంలో ఊహించని విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకి ఆకస్మికంగా వెళ్ళడం సంచలనంగా మారింది. ఢిల్లీలోని కేంద్ర బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ ని ఆహ్వానం అందించినట్లుగా తెలుస్తుంది.
ఈ నేపధ్యంలో ఫ్యామిలీతో కలిసి ఉదయపూర్ వెళ్ళిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక ఢిల్లీలో నేడు అమిత్ షా, జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఈ విషయం బయటకి రావడంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారింది. అసలు పవన్ కళ్యాణ్ భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి. రానున్న రోజులలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పవన్ కళ్యాణ్ తో పొత్తు కోసం చూస్తున్న తెలుగుదేశం పార్టీకి ఈ కలయిక ఒకింత ఆందోళన కలిగించే అంశం అని చెప్పాలి.