Tollywood ప్రతి నెలలో టాలీవుడ్ నుంచి చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని హిట్స్, మరికొన్ని ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఎవరేజ్ టాక్ తెచ్చుకొని తరువాత లాంగ్ రన్ లో ప్రేక్షకులకి కనెక్ట్ అయిన మూవీస్ కూడా ఉంటాయి. పాజిటివ్ టాక్ తెచ్చుకొని కమర్షియల్ ఫెయిల్యూర్ అయిన సినిమాలు కూడా ఉంటాయి. డిఫరెంట్ జోనర్ కథలతో ఈ మధ్యకాలంలో దర్శకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గతంలో ఎక్కువగా కమర్షియల్ పంథాలోనే సినిమాలు చేసే దర్శకులు ఇప్పుడు యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలతో కొత్తగా తమని తాము ఆవిష్కరించుకోవడానికి రెడీ అవుతున్నారు.
ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో కూడా అలాంటి డిఫరెంట్ సినిమాలు రాబోతున్నాయి. ఏప్రిల్ 7న రవితేజ రావణాసుర మూవీ రిలీజ్ కాబోతుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న హీరోయిక్ రోల్ లో రవితేజ నటిస్తూ ఉండగా యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో మూవీ రాబోతుంది. అదే రోజు కిరణ్ అబ్బవరం మీటర్ మూవీ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అవుతుంది. ఇక ఏప్రిల్ 14న సమంత శాకుంతలం మూవీ రిలీజ్ అవుతుంది మైథలాజికల్ లవ్ స్టొరీగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇక అదే రోజు తమిళ్ నుంచి డబ్బింగ్ సినిమాలుగా లారెన్స్ రుద్రుడు, విజయ్ ఆంటోనీ బిచ్చగాడు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవి కూడా డిఫరెంట్ కథలతోనే తెరకెక్కుతున్న సినిమాలు కావడం విశేషం. ఇక ఏప్రిల్ 21న సాయి తేజ్ విరూపాక్ష మూవీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన సినిమా. ఇక ఏప్రిల్ 28న అఖిల్ ఏజెంట్ మూవీ స్పై థ్రిల్లర్ గా రాబోతుంది. ఇక మణిరత్నం పొన్నియన్ సెల్వన్ 2 మూవీ హిస్టోరికల్ యాక్షన్ డ్రామాగా రిలీజ్ కాబోతుంది. మరి వీటిలో ఏ సినిమా ప్రేక్షకులని సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తుంది అనేది చూడాలి.