Wed. Jan 21st, 2026

    Rama Navami: ఈ మానవ జీవితంలో హిందూ ఆద్యాత్మిక ప్రపంచంలో రామాయణం కథ అత్యంత పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అలాగే సీతారాములు మన జీవితానికి ఆదర్శం అని అనాదిగా మన పూర్వీకులు చెబుతూ వస్తున్నారు. రామాయణం కథలో అన్ని కష్టాలే ఉంటాయి. ఎక్కడా కూడా సీతారాములు సుఖపడినట్లు ఉండదు. అలాగే సీత పాతివ్రత్యాన్ని సంక్షించిన శ్రీరాముడు ఆదర్శపురుషుడు ఎలా అయ్యాడు. గర్భవతిగా ఉన్న సీతని అరణ్యానికి పంపించిన శ్రీరాముడు పురుషులకి ఆదర్శం ఎలా అవుతాడు. అంటే శ్రీరాముడులా భార్యని అడవులకి పంపించాలా అని ప్రశ్నించే వారు ఉన్నారు. అయితే శ్రీరాముడి పాత్ర ఔచిత్యం అర్ధం చేసుకుంటే ఈ మాటలు మాట్లాడలేరు. దేవుడు కంటే ముందుగా శ్రీరాముడు ఒక నాయకుడుగా తనని తాను సృష్టించుకున్నాడు.

    Warrior Lord Ram, HD wallpaper | Peakpx

    అలా చిన్న వయస్సులో రాజ్యభోగాలని వదిలేసి విద్య నేర్చుకోవడానికి విస్వామిత్రుడు వెంట వెళ్ళారు. చక్రవర్తిగా తనను తాను సృష్టించుకోవడానికి భోగాలని వదిలేసి నిజమైన నాయకుడు అనిపించుకున్నాడు. ఇక సీతాస్వయంవరంలో ఎంతో మంది రాజులు పోటీ పడ్డారు. అయితే తాను మొదటి చూపులోనే ఇష్టపడిన స్త్రీ కోసం సాక్షాత్తు శివధనుస్సుని సైతం విరవడానికి సిద్ధమయ్యాడు. ప్రేమకోసం దైవాన్ని సైతం సవాల్ చేయొచ్చు అనే గొప్ప భావాన్ని ఈ ఘట్టం చెబుతుంది. ఇక శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి తండ్రి మాట కోసం సిద్దమయ్యాడు. అక్కడ నాయకత్వం కంటే తండ్రి గౌరవం, అతని మాట ఎప్పటికి తప్పు కాకూడదు అని ఆలోచించిన సత్పురుషుడు అనిపించుకున్నాడు. అరణ్యవాసంలో బంగారు జింక మాయ అని తెలిసిన కూడా భార్య కోరిక తీర్చడం భర్త బాద్యత అని భావించి దానిని బంధించి తీసుకురావాలని ప్రయత్నం చేశారు.

    Lord Rama's Bharat Tirtha Yatra - Shri Rama Bharat Desha Parikrama

    ఇందులో సఫలీకృతం అయిన భార్యని కోల్పోయాడు. కష్టంలో కూడా తన వెంట నడిచి వచ్చిన భార్యని రక్షించుకోలేకపోయాను అనే బాధ అతనిలో కనిపిస్తుంది. ఇక ఆమె కోసం అరణ్యంలో ఉన్న స్వర్వ ప్రాణుల సహకారం తీసుకుంటాడు. అన్నిటికంటే అడవి మొత్తం ఎరిగిన వానరసేనని తన సైన్యంగా మార్చుకుంటాడు. ఇక్కడ రాముడిలో ఒక పరిణితి కలిగిన వ్యక్తి కనిపిస్తాడు. ఇక తన భార్యని అపహరించిన రావణ సంహారం చేయడం ద్వారా సీత సంకల్పాన్ని నెరవేర్చిన గొప్ప భర్తగా కనిపిస్తాడు. చక్రవర్తిగా పట్టాభిషక్తుడు అయ్యాక గర్భవతి అయిన భార్యని అరణ్యానికి పంపించిన శ్రీరాముడుని అందరూ చూస్తారు. కాని ఒక రాజుకి, ప్రజా నాయకుడికి కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అని చెప్పే ప్రయత్నం చేశాడు. తన సంతోషాన్ని, ప్రేమని సైతం ప్రజల మాట కోసం వదులుకున్నాడు.

    Rama breaks the divine bow to marry Sita- The New Indian Express

    సీత అరణ్యవాసం చేసిన సమయంలో శ్రీరాముడు కేవలం చక్రవర్తిగా తీర్పులు చెప్పే సమయంలో తప్ప మిగిలిన కాలం అంతా కూడా రాజభోగాలకి దూరంగా ఉన్నాడు. సీతకి లేని సుఖాలు తనకి అవసరం లేదని పరిత్యజించి ఏకపత్నివ్రతం స్వీకరించిన వ్యక్తిలా ఆమెని అనుసరించాడు. శ్రీరాముడు జీవించిన కాలంలో ఎప్పుడు కూడా రాజభోగాలకి అనుభవించలేదు. ఒక నాయకుడుగా ప్రజలకి కావాల్సిన పాలన అందించాడు. ఒక భర్తగా సీత కోసం జీవితాన్ని అర్పించాడు. సత్వగుణ సంపన్నుడిగా కీర్తిపథంలో నిలిచిపోయాడు. శ్రీరాముడు పడినన్ని కష్టాలు జీవితంలో ఎవరు అనుభవించి ఉండరు. కాని అన్ని కష్టాలలో కూడా ఏనాడూ తన ధర్మాన్ని మాత్రం అతను విడువలేదు. అందుకే శ్రీరాముడు అందరికి ఆదర్శప్రాయుడు