NTR 30: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పోరాటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కుతూ ఉంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ అందుకున్న తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి రాబోయే సినిమా ఇదే కావడంతో దీని పైన హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇక వాటిని అందుకోవడానికి కొరటాల శివ చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఆచార్య లాంటి డిజాస్టర్ మూవీ తర్వాత కొరటాల శివ ఈ సినిమాని చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఎంతో నమ్మకంతో ఏడాది పాటు వెయిట్ చేసి మరి ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్తున్నారు. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా లాంచ్ అయిన సంగతి తెలిసిందే.
ఈ మూవీలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తూ ఉంది. ఇక అన్ని భాషల నుంచి ఈ మూవీలో క్యాస్టింగ్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కోసం ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ ను రంగంలోకి దించుతూ ఉండటం విశేషం. 175 సినిమాలకు స్టంట్ మాస్టర్ గా పనిచేసిన కెన్ని బేట్స్ ఎన్టీఆర్ 30 మూవీ కోసం ప్రత్యేకంగా తీసుకున్నారు. కెన్ని బేట్స్ స్టంట్ మాస్టర్ గా హాలీవుడ్ లో మిషన్ ఇంపాజిబుల్: ఘోస్ట్ ప్రోటోకాల్, ఇటాలియన్ జాబ్, ట్రాన్స్ఫార్మర్స్ సిరీస్ లకి వర్క్ చేశారు.తాజాగా అతను కూడా ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో పార్టిసిపేట్ చేసినట్లు తెలుస్తోంది.
అలాగే మూవీ కోసం కొన్ని ఇంటెన్ష్ ఉన్న యాక్షన్ సీక్వెన్స్ ని ఇప్పటికి కొరటాల శివకి నేరేట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో బాహుబలి తర్వాత ఇండియన్ సినిమాలకు హాలీవుడ్ నిపుణులు పనిచేస్తూ ఉండడం సినిమాలపై హై ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి కారణం అవుతుంది. ఇప్పుడు తారక్ సినిమాకి కూడా హాలీవుడ్ స్టంట్ మాస్టర్ పనిచేస్తూ ఉండడంతో కచ్చితంగా పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో ఉంటాయని ఫాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకి కోలీవుడ్ సెన్సేషన్ అనిరుద్ రవిచంద్ర మ్యూజిక్ అందిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఎడిటర్ గా స్పీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైన్ గా సాబు సిరిల్, సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు పనిచేస్తూ ఉండడం విశేషం.