RRR: ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు చరిత్ర సృష్టించింది. ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి చిత్రంగా ఇది గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ యువనికపై భారత జెండాని గర్వంగా పరిచయం చేసింది. అయితే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ నామినేషన్ కోసం పంపించినప్పుడు కమర్షియల్ సినిమా అంటూ అసలు కనీసం పరిగణంలోకి కూడా తీసుకోలేదు. దీని స్థానంలో చల్లో షో అనే గుజరాత్ సినిమాకి ప్రాధాన్యత ఇచ్చి ఆస్కార్ నామినేషన్ కోసం పంపించింది. అయితే ఓపెన్ కేటగిరిలో ఆస్కార్ పోటీలకు వెళ్ళిన ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి ఫైనల్ నామినేషన్ కోసం వెళ్ళింది.
ఇక అక్కడ సక్సెస్ అయ్యి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. అయితే ఇండియాలో కమర్షియల్ సినిమా అంటే తిరస్కారణకి గురైన ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవ నిలబెట్టింది. అలాగే ఇది ఇండియన్ సాంగ్ అని ప్రతి భారతీయుడు చెప్పుకునే స్థాయిలో గ్లోబల్ బజ్ క్రియేట్ చేసింది. ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలు నాటు నాటు లైవ్ పెర్ఫార్మన్స్ కి ఏకంగా హాలీవుడ్ అతిరథ మహారధులు అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టి ప్రశంసలు కురిపించారు.
దీని నేపథ్యం సోషల్ మీడియాలో ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్షన్స్ సరిగా లేకపోవడం వలన భారతీయ సినిమా ఇప్పటివరకు ఆస్కార్ అవార్డులను గెలుచుకోలేదు అనే విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్ట్ మూవీలను మాత్రమే ఫిలిం ఫెడరేషన్ ఆస్కార్ అవార్డులకు పంపిస్తూ ఉండడం కూడా ఒక కారణం చెప్పాలి. మరి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకునే భవిష్యత్తులో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మార్చుకుంటుందా అనేది చూడాలి.