Janasena: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ఆవిర్భావ సభ నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే జనసేన చేపట్టే కార్యక్రమాలకి వైసీపీ పార్టీ నుంచి ఎప్పుడూ కూడా అడ్డంకులు ఉంటాయనే మాట రాజకీయ వర్గాలలో అందరికి తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ పర్యటన ఉంటుంది అంటే ఆటోమేటిక్ గా సెక్షన్ 30 అమల్లోకి వస్తుంది. ఇక తాజాగా జనసేన బీసీ సంఘాలతో పాటు, కాపు సంఘాలతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ అయ్యారు. ఈ రెండు మీటింగ్ లు సక్సెస్ కావడంతో పాటు కాపు, బీసీ సంఘాల నుంచి పవన్ కళ్యాణ్ మద్దతు ఉంటుంది అనే విషయంపై స్పష్టత వచ్చింది.
జనసేన ఆవిర్భావ సభ కోసం జనసేన నాయకులు ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్టీఅర్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా సభకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. అదే సమయంలో కొంత మంది కీలక నాయకులు పార్టీలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు జనసేన గూటికి వచ్చారు. ఆవిర్భావ సభ కోసం కనీసం 5 లక్షల మంది ప్రజలు వస్తారని భావిస్తున్నారు. వారందరినీ అడ్డుకోవాలంటే సెక్షన్ 30 అమల్లో ఉందనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఎలాంటి ర్యాలీలకి అనుమతి లేదని, కేవలం సభకి మాత్రమే అనుమతి ఉందని ఎస్పీ కూడా స్పష్టం చేశారు. అయితే జనసేన ర్యాలీని అడ్డుకుంటే మాత్రం కచ్చితంగా అది రాష్ట్రంలో సంచలనంగా మారుతుంది. మరి దీని కోసం జనసేనాని ఎలాంటి ఆలోచన చేస్తారు. అలాగే సభలో పాల్గొనడానికి వచ్చేవారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది చూడాలి. అయితే జనసైనికులు మాత్రం పోలీసులు అడ్డుకున్న కూడా ర్యాలీలు చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.