Health: ఏ ముహూర్తాన కరోనా మానవ సమాజంలోకి అడుగుపెట్టిందో కాని ప్రజలని మానసికంగా, శారీరకంగా బలహీనులుగా మార్చేసింది అని చెప్పాలి. చిన్న సమస్య వచ్చిన కూడా హాస్పిటల్స్ కి పరుగులు పెట్టె స్థాయిలో ఇప్పుడు ప్రజలు వణికిపోతున్నారు. రెండేళ్ళ కాలం పాటు కరోనా విజృంభించింది. కోట్లాది మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఈ కరోనా నుంచి ప్రపంచం బయటపడింది అనేసరికి ఇప్పుడు మరోకొత్త వైరస్ ఎటాక్ చేసింది. ఇన్ఫ్లూయింజా బారిన ప్రజలుపడుతున్నారు . ఇది ఒకరకమైన వైరల్ ఫీవర్స్ . హాంకాంగ్ ఫ్లూ అని పిలవబడే హెచ్ 3ఎన్2 ఇప్పుడు కొత్త వెర్షన్ లో. ఇప్పటికే ఇండియన్ మెడికల్ కౌన్సిల్ అన్ని రాష్ట్రాలకి దీనిపై హెచ్చరికలు జారీ చేసింది.
ఈ వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది అని తెలిపింది. అప్రమత్తంగా ఉండటంతో పాటు హాస్పిటల్స్ లో సరిపడ ఆక్సిజన్, బెడ్ లు రెడీ చేసుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ఈ హాంకాంగ్ ఫ్లూ వైరస్ కారణంగా వచ్చే ఇన్ ఫ్లూయింజా ఫీవర్స్ చాలా ప్రమాధకం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవి కూడా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. ఇప్పటికే కర్నాటక, హర్యానా రాష్ట్రాలలో ఈ వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోయారు. ఇక కేసుల సంఖ్య కూడా పెరుగుతుందని తెలుస్తుంది.
ముఖ్యంగా హాంకాంగ్ వైరస్ బారిన పడేవారిలో వ్యాధి లక్షణాలు జ్వరం, వణుకు, దగ్గు, శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకునేటపుడు శబ్దాలు రావడం వంటివి ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. వాంతి వచ్చినట్లు అనిపించడం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, డయేరియా తదితర లక్షణాలు కూడా కనిపిస్తాయని తెలిపారు. అయితే ఈ లక్షణాలు వారం రోజులకి పైగా ఉంటే కచ్చితంగా అలెర్ట్ అయ్యి హాస్పిటల్ కి వెళ్లి టెస్ట్ లు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీలైనంత అప్రమత్తంగా ఉండాలని కూడా చెబుతున్నారు. పిల్లలు వీటి బారిన పడే ప్రమాదం ఉందని అంటున్నారు.