Spiritual: మన భారతీయ హిందూ మత ఆచారాలలో ఎన్నో పండుగలు ఉన్నాయి. అలాగే ప్రతి పండుగ వెనుక ఒక విశేషమైన కారణం ఉంటుంది. ఆ కారణాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అయితే ఈ కారణాలని కొంత మంది మూఢ నమ్మకాలు అని కొట్టిపారేసిన వాటి వెనుక బలమైన శాస్త్రీయ సంబంధ నిజాలు ఉంటాయని హిందువులు బలంగా నమ్ముతూ ఉంటారు. అందుకే హిందువుల తమ మత విశ్వాసాలని కచ్చితంగా విశ్వసిస్తూ ఉంటారు. ఇలా హిందూ ఆచార వ్యవహారాలలో భాగమైన పండుగలలో హోలీ కూడా ఒకటి. అయితే ఈ హోలీ పండుగ అంటే అందరూ రంగులు జల్లుకోవడం అని అనుకుంటారు.
నిజానికి హోలీ రోజున పెద్ద పెద్ద మంటలు వేసి కామదహనం వేడుక నిర్వహిస్తారు. అలాగే హోలిక దహనం కూడా చేస్తారు. ఉదయాన్నే కామదహనం వేడుక ఉంటే చీకటి పడిన తర్వాత హోలికా దహనం ఉంటుంది. నిజానికి ఇదే అసలైన హోలీ పండుగ అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. కామదేవుడు అయిన మన్మధుడు మహాశివుడిపై మన్మధ బాణం వేసి అతని తపస్సుని భగ్నం చేస్తాడు. దీనికి కోపంతో శివుడు కామదేవుడిని దగ్ధం చేశాడు. అయితే అతని భార్య రతీదేవి అభ్యర్ధన మేరకు తిరిగి బ్రతికిస్తాడు. అయితే అంత వరకు మొహం సమ్మోహనంతో ఉన్న కామదేవుడిని ప్రేమపూర్వకమైన మన్మధుడిగా మహాశివుడు మారుస్తాడు.
అందుకే ఆ రోజున మనలో ఉన్న కామాన్ని దహనం చేయాలని సూచిస్తూ ఈ భోగి మంటలు లాంటివి వేసి కామదహనం చేస్తారు. అలాగే హిరణ్యకశిపుడు చెల్లెలు అయిన హోలిక సహారంకి ప్రతీకగా కూడా హోలికా దహనం అనే వేడుక నిర్వహిస్తారు. అలాగే హిరణ్యకశిపుడుని నరసింహుడు సంహరించి ప్రజలకి అతని బాధల నుంచి విముక్తి కల్పించినందుకు హోలీ సంబరాలు చేసుకుంటారు. ఇలా మన సనాతన ధర్మంలో హోలీ వేడుకకి, కామ దహనంకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ఈ హోలీ ఫెస్టివల్ ని ఉత్తరాది రాష్ట్రాలలో ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా గుజరాత్, యూపీలో ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరుగుతుంది. మార్చి 7న ఈ ఏడాది హోలీ పండుగని ప్రజలు జరుపుకోవడానికి సిద్ధం అవుతున్నారు.