Kriti Shetty : ఉప్పెన లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాతో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన కుర్రభామ కృతిశెట్టి. మొదటి సినిమాతో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా తర్వాత ఆరేడు సినిమాలకి వరుసగా సైన్ చేసి తోటి హీరోయిన్స్‌కి షాకిచ్చింది. కానీ, ఎగిసిపడిన కెరటంలా ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయింది అమ్మడి కెరీర్. దీనికి కారణం అనూహ్యంగా కృతిశెట్టి చేసిన సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగలడమే.
ఉప్పెన సినిమా తర్వాత కృతిశెట్టి చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్ లాంటి సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ హిట్ అయితే ఇప్పుడు కనీసం 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ బిజీగా ఉండేది. కానీ, కొత్త సినిమాల అవకాశం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది. పాపం మొదటి మూడు సినిమాల తర్వాత కృతి టాలీవుడ్ మీద పెట్టుకున్న ఆశలు వేరు.
కానీ, అవన్నీ గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో ఒకే ఒక్క సినిమా ఉంది. అదికూడా అక్కినేని నాగ చైతన్య సరసన చేస్తున్న సినిమా. కస్టడీ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇంకా కొత్త ప్రాజెక్ట్ ఏదీ అమ్మడి వద్దకి రాలేదు. కస్టడీ సక్సెస్ మీదే కృతిశెట్టి కెరీర్ ఆధారపడి ఉంది. ఈ సినిమా గనక రిజల్ట్ తేడా వస్తే ఇక కృతి కెరీర్ డైలమాలో పడినట్టే అంటున్నారు. తన తోటి హీరోయిన్స్ కేతిక శర్మ, నేహ శెట్టి కాస్త నెమ్మదిగా బండి లాగించేస్తున్నారు. కేతిక ఇటీవల మెగా హీరోలు నటిస్తున్న మల్టీస్టారర్ మూవీలో ఛాన్స్ అందుకుంది. మరి మెగా కాంపౌండ్‌లోకి మళ్ళీ కృతిశెట్టి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో చూడాలి.