Wed. Jan 21st, 2026

    Varalakshmi Sharathkumar: హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న అందాల భామ వరలక్ష్మి శరత్ కుమార్. తండ్రి వారసత్వంతో నటిగా తెరంగేట్రం చేసిన ఈ బ్యూటీ హీరోయిన్ గా చాలా తక్కువ సినిమాలకే పరిమితం అయింది.

    varalakshmi-sharathkumar-stunning-looks-goes-viral
    varalakshmi-sharathkumar-stunning-looks-goes-viral

    అయితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకున్న తర్వాత తమిళంలో విజయ్ కి విలన్ గా నటించింది, ఆ తర్వాత విశాల్ కి విలన్ గా పందెం కోడి 2లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. దీంతో టాలీవుడ్ లోకి కూడా తెనాలి రామకృష్ణన్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించింది.

    varalakshmi-sharathkumar-stunning-looks-goes-viral
    varalakshmi-sharathkumar-stunning-looks-goes-viral

    తరువాత రవితేజ క్రాక్ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించి సూపర్ సక్సెస్ అందుకున్న ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ఓ వైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పవర్ ఫుల్ రోల్స్ లో నటిస్తూ మరో వైపు విలన్ గా మెప్పిస్తూ వరుస సినిమాలతో వరలక్ష్మి సందడి చేస్తుంది.

    varalakshmi-sharathkumar-stunning-looks-goes-viral
    varalakshmi-sharathkumar-stunning-looks-goes-viral

    చివరిగా ఈ బ్యూటీ బాలకృష్ణవీరసింహారెడ్డి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత భాగా లావుగా ఉండేది. ఆమె హీరోయిన్ గా సక్సెస్ కాకపోవడానికి ఇది కూడా ఒక కారణం. అయితే తరువాత వర్క్ అవుట్స్ చేసుకొని, అలాగే వెయిట్ లాస్ ట్రీట్మెంట్ తీసుకొని కంప్లీట్ గా స్లిమ్ అయ్యింది.

    Image

    ఇప్పుడు హీరోయిన్స్ గా సమానంగా గ్లామర్ విషయంలో వరలక్ష్మి శరత్ కుమార్ పోటీ పడుతుంది. అదే సమయంలో సోషల్ మీడియాలో గ్లామర్ షోతో సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు బీచ్ ఒడ్డున ఇసుక తెన్నెల మీద ఆడుతూ ఉన్న ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలలో ఆమె టెంప్టింగ్ లుక్స్ తో కుర్రాళ్ళకి చూపుల బాణాలు విసురుతూ ఉంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.