Guppedantha manasu serial: జగతి, మహింద్ర మాటలన్ని గుర్తుచూసుకుంటూ కోపంతో రగిలిపోతుంది దేవయాని. రిషి నా గుప్పెట్లో ఉన్నంత వరకు మీరు నన్నేం చేయలేరు.. రిషి నిజం చెప్తాడో అబద్ధం చెప్తాడో ఇపుడే తేలిపోతుంది అనుకుంటూ రిషి గదికి వెళ్తుంది దేవయాని. నాన్నా.. రిషి నిన్న ఎక్కడికో వెళ్లారట కదా అని అడగ్గా.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించి వెళ్లాం పెద్దమ్మా అని చెప్తాడు. అది విని రిషి నిజమే చెప్తున్నాడని అనుకుంటుంది దేవయాని. అపుడే అసలు ఎవరినో పెళ్లి చేసకున్న వసుధారతో నువ్ వెళ్లడమేంటి నాన్నా అని రెచ్చగొడుతుంది రిషిని. ఇవన్నీ మీకు అవసరం లేదు పెద్దమ్మా అని కొట్టిపడేస్తాడు రిషి.
సీన్ కట్ చేస్తే.. జగతి, మహింద్రలు గదిలో కూర్చుని వసు, రిషిల గురించి మాట్లాడుకుంటారు. అపుడే రిషి వచ్చి డోర్ కొడతాడు. ‘మేడం మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా’ అంటాడు రిషి జగతితో. మీరు వసు పెళ్లి చేసుకుని వచ్చాక కోపంగా ఉన్నారు ఇపుడు అలా లేరని అనుమానం వ్యక్తం చేస్తాడు రిషి. మీకేదైనా తెలిస్తే చెప్పండి మేడం అంటాడు. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేను మేడం వసుధార గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి అంటూ వెళ్లిపోతాడు. ఆ తర్వాత రిషికి నిజం చెప్పేద్దాం అంటాడు మహింద్ర. అలా చేస్తే వసు పరిస్థితి ఏమౌతుందో ఆలోచించు అని అంటుంది జగతి. రెండ్రోజుల్లో రిషి నిజం తెలుసుకోలేకపోతే నేనే నిజం చెప్పేస్తా.. అంటూ వెళ్లిపోతాడు మహింద్ర.
Guppedantha manasu serial: అక్కడ వసుధార రిషి మాటల్ని తలుచుకుంటూ బాధపడుతుంది. అది చూసి చక్రపాణి బాగా అలిసిపోయావమ్మా. ఫ్రెషప్ అవమంటాడు. నిజమే నాన్నా అంటుంది వసు. అంతలోనే రిషి కారు హార్న్ సౌండ్ వినిపిస్తుంది. రిషి సారు దగ్గరికి వెళ్తే ఏదో ఒకటి అంటాడు సారే రావాలి అని వసు అనకుంటుంది. సౌండ్ విని వసుధార బయటికి రావచ్చు కదా అనుకుంటాడు రిషి. వసు రాకపోవడంతో రిషి గుమ్మంలోకి అడుగుపెడతాడు. అది చూసి తలనొప్పంటుంది వసు. దాంతో అక్కడే ఆగిపోతాడు రిషి. కొద్దిసేపటి తర్వాత లోపలికి వస్తాడు రిషి. వసు వెళ్లి కాఫీ తీసుకొస్తానంటుంది. ఆ తర్వాత చక్రపాణి, రిషికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. నాకు కాఫీ వద్దని మారాం చేస్తాడు రిషి. చివరకు రిషికి కాఫీ ఇచ్చి తనూ తాగుతుంది.
రిషిని ఉద్దేశించి నాన్నా నేను కాలేజికి వెళ్లను అంటుంది వసు చక్రపాణితో. చెప్పకుండా అలా చేయకూడదు కదా అంటాడు రిషి కూడా. మా ఎండీ గారికి లెటర్ పంపిస్తాను అనుకుంటూ ల్యాప్‌టాప్‌లో టైప్ చేస్తుంది వసు. నాకు తలనొప్పి లేదంటూ రిషి కాఫీ అక్కడే పెట్టేసి వెళ్లిపోతాడు. దారిలో వసు మాటల్ని తలుచుకుంటూ బాధపడతాడు. వసు గురించి ఆలోచిస్తూ ఎమోషనల్ అవుతాడు రిషి. తను ఇలా చేస్తుందంటే ఇంకా నమ్మలేకపోతున్నాను అనుకుంటాడు. అసలు వసు పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరు? అని ఆలోచిస్తాడు.
ఆ తర్వాత సీన్‌లో వసుకు ఏం చేస్తున్నావ్ అంటూ మెసేజ్ పెడతాడు రిషి. ల్యాప్‌టాప్ ఫొటో పెడుతుంది వసు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు చాట్ చేసుకుంటారు. వసుని నేనేమైనా బాధపెట్టానా? అని ఆలోచిస్తాడు రిషి. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..