Maruthi Toyota: ఎన్ని కార్లున్నా మార్కెట్‌లోకి కొత్త కారు వస్తుందంటే అందరి నజర్ దానిపైనే పడుతుంది. కార్లంటే కుర్రాళ్లకు యమ క్రేజ్. కాస్ట్ ఎంతున్నా సరే నచ్చిన ఫీచర్స్ ఉంటే ఇట్టే కొనేస్తుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ కార్లంటే పిచ్చే. ఈ క్రమంలో కార్ల కంపెనీలు తమ సేల్స్‌ను పెంచుకునేందకు మార్కెట్‌లోకి వినియోగదారులను ఆకర్షించే ఫీచర్స్‌తో సరికొత్త కార్లను రూపొందిస్తు న్నారు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్‌లోకి త్వరలో మరో కార్ అందరినీ ఆకట్టుకో బోతోంది. అదే న్యూ మారుతీ టొయోటా MVP. త్వరలో ఈ కార్‌ను ఇంట్రడ్యూజ్ చేసేందుకు మారుతీ కంపెనీ సన్నాహాలు చేస్తోంది.
మారుతి సుజుకి బాలెనోను టయోటా గ్లాంజాగా, మారుతి సుజుకి విటారా బ్రెజ్జా టయోటా అర్బన్ క్రూయిజర్‌గా. టయోటా కిర్లోస్కర్ మోటార్ దాని స్వంత బ్యాడ్జ్‌తో రెండు మారుతి సుజుకి వాహనాలను విడుదల చేయడాన్ని మనం ఇప్పటికే చూశాము. వాహనాల క్రాస్-బ్యాడ్జింగ్ అనేది జపాన్ ఆటో దిగ్గజాలు టయోటా మోటార్ కార్పొరేషన్ , సుజుకి మోటార్ కార్పొరేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఉంది. తాజాగా భారత్ వారి పోర్ట్‌ఫోలియో ప్రకారం కొత్తగా అభివృద్ధి చేసిన మిడ్ సైజ్ SUVని స్వాగదించింది. అయితే ఇప్పుడు టయోటా కిర్లోస్కర్ మోటార్ ఒక నూతన వాహనాన్ని మారుతి సుజుకి ఇండియాకు అందించేందుకు సిద్ధమైంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ కొత్త MPVని విడుదల చేసేందుకు కంపెనీలు సిద్ధమయ్యాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్, మారుతీ సుజీకి సంయుక్తంగా వీటిని విక్రయించనుంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ భారతదేశంలో ఇన్నోవా క్రిస్టా ఎమ్‌పివిని విక్రయిస్తోంది. ఆగస్ట్‌లో, అధిక డిమాండ్ కారణంగా వెయిటింగ్ పీరియడ్ పెరుగుదల కారణంగా , డీజిల్ వేరియంట్ కోసం వచ్చే బుకింగ్‌లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇన్నోవా క్రిస్టా డీజిల్ వాహనం కొన్ని అవసరాలను తీర్చడంలో విఫలం కావడంతో కొత్త బుకింగ్‌లను నిలిపివేసిందని పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఎర్టిగా , XL6 వంటి MPVలతో, మారుతి సుజుకి ఇండియా యొక్క MPV సెగ్మెంట్‌లో 60 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఎర్టిగా CNGలో కూడా అందుబాటులో ఉండటంతో పాటు CNG ఎంపిక ఎర్టిగా వాల్యూమ్‌లకు గణనీయమైన సహకారాన్ని అందిస్తుంది. దీంతో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ప్రతి నెలా దాదాపు 13,000 యూనిట్ల ఎర్టిగా, XL6లను విక్రయిస్తూ లాభాల బాటలో పయనిస్తోంది.