Finger millet biscuits: అత్యంత సులభమైన, రుచికరమైన, తక్కువ సమయంలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా లేకుండా తయారు చేసుకునే ఫుడ్ ఐటమ్ కొబ్బరి రాగి బిస్కెట్లు. క్రంచి గా, టేస్టీ గా ఉండే ఈ హెల్తీ లో ఫ్యాట్ డైట్ బిస్కెట్ లను పసి పిల్లలు, ఎదిగే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. విత్ ఎగ్ , వితౌట్ ఎగ్ బిస్కెట్ లను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్ తో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము.
ఒకసారి పిండిని కలుపుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కావలసినప్పుడు రెడీ గా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు. అంత ఈజీగా వీటిని క్షణాల్లో సిద్దం చేసుకోవచ్చు. ఒకేసారి 24 కూకీస్ తయారు చేసుకోవచ్చు. పెద్ద ఓవెన్ లేకపోతే రెండు భాగాలు గా విభజించి కుక్ చేయవచ్చు.
కావాల్సిన పదార్థాలు :
3/4 కోకోనట్ పౌడర్
3/4 రాగి పిండి
1/2 గోధుమ పిండి
150 గ్రాముల బటర్
150 గ్రాముల చక్కెర
3/4 వెనీలా ఎక్ట్రాక్ట్
ఒక కోడి గుడ్డు
తయారీ విధానం:
సాప్ట్ బటర్ ను ఓ బౌల్ లో తీసుకోవాలి. బటర్ చల్లగా ఉండేల చూసుకోవాలి. బటర్ లో చక్కెర వేసి ప్లఫీ గా వచ్చే వరకు బీట్ చేసుకోవాలి. క్రీమీ గా బటర్ తయారు అయ్యాక ఎగ్, వెనీలా ఎక్ట్రాక్ట్ వేసుకోవాలి. దీనిని కలుపుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి, రాగి పిండి , గోధుమ పిండి వేసి బాగా కలపాలి. పై నుండి చక్కెర వేసి లైట్ గా కలపాలి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న పిండిని ఓ గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి.
ముందుగానే ఓవెన్ ను 180c దగ్గర వేడి చేసుకోవాలి. గంట తర్వాత పిండిని తీసి బేకింగ్ షీట్ మీద కుకీస్ షేప్స్ చేసుకోవాలి. వీటిని 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్యాచ్ లుగా కుకీస్ బేక్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఈ కుకీస్ ను air టైట్ జార్ లో స్టోర్ చేసుకుని కావలసినప్పుడు తినవచ్చు.