Health: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రస్తుతం సమాజంలో చాలా మంది చాలా రకాల పనులు చేస్తున్నారు. ముఖ్యంగా యోగా చేస్తున్నారు. అలాగే వాకింగ్, జిమ్ సెంటర్స్ కి వెళ్లి బరువు తగ్గించుకొని శారీరక సామర్ధ్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పాటు రోజువారీ ఆహారపు అలవాట్లు కూడా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ కాలంలో రోజువారీగా బయట తినే జంక్ ఫండ్స్ కారణంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి అన్ని రకాల రోగాలు చాలా వేగంగా వస్తున్నాయి.
దీంతో చిన్న వయస్సులోనే ఒంట్లో సమస్యలు తలెత్తి ఏ పనులు చేయలేని నిస్సహాయ స్థితికి ప్రజలు వచ్చేస్తున్నారు. ఈ కారణంగా ఇప్పుడిప్పుడు మరల తమ ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్వకాలంలో మన ఆహారపు అలవాట్లు సహజసిద్ధంగా లభించే ఆయుర్వేద ఔషధ మూలికలని అనారోగ్య సమస్యలు దూరం చేసుకోవడానికి ఉపయోగించేవారు. మరల ఇప్పుడు వాటికి ప్రజలు అలవాటు పడుతున్నారు.
అందులో భాగంగా అల్లం టీ, గ్రీన్ టీ వంటివి త్రాగడానికి ఇష్టపడుతున్నారు. అలాగే ఇప్పుడు శారీరక సామర్ధ్యం పెంచుకోవడంతో పాటు ఒంట్లో అనవసరమైన కొవ్వు ఎక్కువ అధిక బరువుతో ఇబ్బంది పడేవారు బే లీఫ్ టీ తాగితే ఎంతో మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బీ లీఫ్ ని తెలుగులో బిర్యాని వండటానికి ఉపయోగిస్తారు. ఈ కారణంగా బిర్యాని అన్ని అని కూడా అంటారు. ఈ బిర్యాని ఆకులు ఎన్నో సహజసిద్ధ ఔషధ లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బిర్యానిలో రుచి కోసం ఈ ఆకుని ఉపయోగిస్తారు. కాపర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం, ఐరన్ వంటి విటమిన్స్, మినరల్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
ఈ కారణంగా అధిక బరువుతో బాధపడేవారు బిర్యాని ఆకు టీ తాగితే చాలా వేగంగా వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉంది. ఒంట్లో ఉన్న అధిక కొవ్వుని ఈ టీ కరిగిస్తుంది. అలాగే ఇందులో ఉన్న మినరల్స్ జీర్ణక్రియని క్రమబద్దీకరిస్తాయి. ఈ కారణంగా జీర్ణ సంబంధ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. బిర్యాని ఆకు టీ కోసం ఆ ఆకుతో పాటు వాము, సోంపు మిశ్రమాన్ని నీటిలో వేసి బాగా వేడి చేసిన తర్వాత అందులో తేనె వేసుకొని తాగాలి. ఇలా ప్రతి రోజు త్రాగడం వలన మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గడానికి రోజువారీగా చేస్తున్న వ్యాయామానికి ఇది అదనంగా ఉపయోగపడుతుంది. అధిక బరువు ఉన్నవారు ఓ సారి ట్రై చేసి చూడండి.