Spirtual: మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది మహావీరుల కథలు మనకి కనిపిస్తాయి. అందులో కొన్ని పాత్రలు కల్పిత పాత్రలని భావిస్తారు. మహాభారతంలో ఎంతో మంది మహావీరుల గురించి ప్రస్తావించబడి ఉంటాయి. పాండవులు, కౌరవులు అందరూ పరాక్రమవంతలే. అలాగే కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొన్న ఎంతో మంది వీరుల గురించి మహాభారత గ్రంథంలో చెప్పబడి ఉంటుంది.
అయితే ఎంత మంది గురించి చెప్పిన మహాభారతంలో అందరికంటే ఎక్కువగా, అందరికి వినిపించే పేరు మాత్రం అర్జునుడు. పాండవులలో ఒకడిగా సమూల కౌరవ సేనని కృష్ణుడి అండతో సంహరించిన ధీశాలిగా అతను కనిపిస్తాడు. అర్జునుడికి ఉన్న మరొక్క పేరే సవ్యసాచి. అందరికంటే ముందుగా ఆ పేరుని స్వీకరించే అర్హత కలిగిన వ్యక్తిగా అర్జునుడిని చెప్పుకుంటున్నారు.
అయితే ప్రస్తుత సమాజంలో చాలా మందికి ఆ సవ్యసాచి అనే పేరుకి అర్హత ఉంటుంది. సవ్యసాచి అంటే రెండు చేతులలో సమానమైన బలం కలవాడు అని అర్ధం వస్తుంది. అలాగే ఒకే సారి రెండు చేతులు ఉపయోగించి పని చేయగల సామర్ధ్యం ఉన్నవాడు అని కూడా భావన వస్తుంది. అర్జునుడికి ఈ పేరు రావడానికి బలమైన కారణం ఉంది. అర్జునుడు తన గాండీవాన్నీ రెండు చేతులతో కూడా సంధించగల సామర్ధ్యం కలిగి ఉంటాడు. కుడి చేతితో ఎంత అద్భుతంగా అయితే గాడీవంతో బాణాన్ని సంధించగలడో అంతే స్థాయిలో ఎడమ చేతితో కూడా సందించగలడు.
నిజానికి ఎవరికీ కూడా రెండు చేతులలో సమాన బలం ఉండదు. కొందరికి ఎడమ చేతి వాటం ఉంటే వారికి కుడి చేతి బలం తక్కువగా ఉంటుంది. కుడి చేతి వాటం ఉన్నవారికి ఎడమ చేతి బలం తక్కువగా ఉంటుంది. అయితే లక్షల్లో, కోట్లలో అతి కొద్ది మందికి మాత్రమే రెండు చేతులలో సమాన బలం ఉంటుంది. అలా ఉన్నవారిని సవ్యసాచితో పోలుస్తారు. సవ్యసాచి అనిపించుకోవడం అంత సులభమైన పని కాదు. దానికి కఠోర శ్రమ కావాల్సి ఉంటుంది. చరిత్రలో సవ్యసాచిల గురించి చెప్పుకుంటే మొదటిగా వినిపించే పేరు మహాభారతంలో అర్జునుడిదే వస్తుంది.