Thu. Aug 20th, 2026

    Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు పెద్ద ఎత్తున వరమహాలక్ష్మి వ్రతమాచరిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో వచ్చే పూర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వరమహాలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఇక ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం ఆగస్ట్ 21వ తేదీ జరుపుకొనున్నారు అయితే వరలక్ష్మీ వ్రతం జరుపుకునే వారిలో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇదివరకు ఎప్పుడు వరలక్ష్మీ వ్రతం చేయని వారు కొత్తగా చేయవచ్చా? పెళ్లయిన మహిళలు మాత్రమే వరలక్ష్మి వ్రతం చేయాలా? పెళ్లి కాని వారు చేయకూడదా? వితంతువులు ఈ వ్రతం ఆచరించవచ్చా అనే ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తూ ఉంటారు.

    ఇలా వరమహాలక్ష్మి పూజ విషయం గురించి ఈ సందేహాల పట్ల ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్య నారాయణమూర్తి సూచనల ప్రకారం, భక్తి, విశ్వాసం ఉన్న ఎవరైనా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చని తెలియజేశారు. పెళ్లయిన మహిళలు మాత్రమే కాకుండా పెళ్లి కాని వారు కూడా వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చని తెలియజేశారు. అలాగే వితంతువులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చని తెలిపారు. ఇక మొదటిసారి వ్రతం చేసేవారు తప్పనిసరిగా ఈ వ్రత నియమాలను తెలుసుకొని పూజ చేయడం మంచిది.ఒకవేళ ఈ వ్రత నియమాలు తెలియకపోతే పురోహితుడు సమక్షంలో వరలక్ష్మి వ్రతం చేయించడం మంచిదని తెలిపారు.

     

    Varalakshmi Vratam 2026:వరలక్ష్మీ వ్రతంలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యం

    ఇక వర మహాలక్ష్మి వ్రతం ఆచరించే వారు తప్పనిసరిగా కలశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వరలక్ష్మీ వ్రతంలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో మంటపం ఏర్పాటు చేసి, బియ్యంపై కలశాన్ని ఉంచాలి. కలశంలో నీటిని నింపి మామిడాకులు, కొబ్బరికాయను ఏర్పాటు చేసి, అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. స్తోమత ఉన్నవారు అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేసి ఈ పూజ ఆచరిస్తారు అయితే అమ్మవారి వ్రతం పూజలు అలంకరణ కంటే భక్తి ముఖ్యమని పండితులు సూచిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉంటాయి.