MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ జనవరి 12న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దడదడలాడించింది. పాన్ ఇండియా సినిమాలు కూడా ఈసారి, ఇటువంటి సంచనలం సృష్ఠించలేదు. కరెక్ట్‌గా అన్నయ్య స్టామినాకి, కామెడీ టైమింగ్‌కి తగ్గ కథ దొరికే ఆ విధ్వంసం ఎలా ఉంటుందో మన శంకరవరప్రసాద్ గారు చూపించింది.
అనిల్ రావిపూడి చెప్పి మరీ హిట్ కొట్టాడబ్బా.. అని ఈ సినిమా సక్సెస్ చూసి మాట్లాడుకుంటుంటే..అబ్బా ఈసారి కూడా దొరకలేదని ఇంకొందరు అనుకుంటున్నారు. వరుసగా 9 సినిమాలతో అనిల్ రావిపూడి, టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తర్వాత సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. గత సంక్రాంతికి విక్టరీ వెంకటేష్‌తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్న అనిల్ రావిపూడి, ఈ సంక్రాంతికి మెగాస్టార్‌తో మన శంకరవరప్రసాద్ గారు మూవీతో బాక్సులు బద్ధలు కొట్టారు.
చిరు-నయనతార-వెంకీ:

MSG: హీరోహీరోయిన్స్‌గా మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూపర్ స్టార్ నయనతార
హీరోహీరోయిన్స్‌గా మెగాస్టార్ చిరంజీవి-లేడీ సూపర్ స్టార్ నయనతార అనగానే మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి కారణం నయన్‌కి ఉన్న సక్సెస్ ట్రాక్ రికార్డ్. ఇక, ఈ సినిమా కోసం ఆమె ప్రమోషన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పెద్ద పాజిటివ్ వైబ్‌ని క్రియేట్ చేసింది. అలాగే, ఇప్పటి వరకూ చిరు-వెంకీ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇది సినిమా సక్సెస్‌లో మేజర్ క్రెడిట్ దక్కించుకుంది. ఈ కాంబోలో సీన్స్‌ని డిజైన్ చేసిన దర్శకుడు అనిల్ రావిపూడి అందరి ప్రశంసలు అందుకున్నాడు.
ఇచ్చిన మాట..ఇంటిపేరు నిలబెట్టుకున్న మెగా డాటర్:
మన శంకరవరప్రసాద్ గారి సినిమాకి నిర్మాతలు సుష్మిత కొణిదెల, సాహు గారపాటి. సినిమా ప్రారంభమైనప్పుడు వదిలిన వీడియోలో చిరు అందరినీ పరిచయం చేసుకున్న క్రమంలో సుష్మిత కూడా తన ఇంటిపేరు “కొణిదెల” అని చెప్తుంది. దీనికి మెగాస్టార్ ‘శభాష్..ఇంటిపేరు నిలబెట్టాలి’.. అని బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఆ మాటను తండ్రి చిరంజీవికి బ్లాక్ బస్టర్ ఇచ్చి నిలబెట్టుకుంది సుష్మిత. ఇక, ఈ సినిమా బాక్సాఫీస్ లెక్కలు చూస్తే బాసూ బాక్సులు బద్ధైలైయ్యాయి అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను వైరల్ చేస్తున్నారు.

మన శంకరవరప్రసాద్ గారు 100 కోట్ల గ్రాస్ దాటి..200 కోట్ల గ్రాస్ దాటి సంచలనం సృష్ఠించింది. ఇప్పుడు ఇదే జోరు కొనసాగిస్తూ ఈ సినిమా రిలీజైన 6 రోజుల్లో 261 కోట్ల గ్రాస్‌ను వరల్డ్ వైడ్‌గా రాబట్టి, సక్సెస్‌ఫుల్‌గా థియేటర్స్‌లో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ కొత్త పోస్టర్‌ను వదిలారు. అంతేకాదు, ఈరోజు (జనవరి 18) చిత్ర బృందం అంతా ఏపీలోని ఏలూరు, గణపవరం, తణుకు, రావులపాలెం అలాగే, రాజమండ్రిలోని కొన్ని థియేటర్లలో అభిమానులను కలుసుకోనుంది. మొత్తానికి, ఇది మెగా ర్యాంపేజ్ అని చెప్పాల్సిందే.

