Mon. Jan 19th, 2026

    Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ పెద్ది. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా మంచి పాపులారిటీని సంపాదించుకున్న బుచ్చిబాబు సానా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా ఎలా ఉంటుందో అనే కొన్ని సందేహాలు అందరిలోనూ ఉండేవి. కానీ, పెద్ది నుంచి చరణ్ లుక్ ఆ తర్వాత వచ్చిన ఫస్ట్ షాట్‌తో ప్రతీ ఒక్కరికీ సాలీడ్‌గా క్లారిటీ వచ్చేసింది.

    బుచ్చిబాబు రంగస్థలం సినిమాని మించి భారీ హిట్ ఇచ్చే సినిమాను చరణ్ కోసం రూపొందిస్తున్నట్టుగా క్లారిటీ వచ్చింది. ఫస్ట్ షాట్ కోసం ఏఆర్ రెహమాన్ అందించిన బీజిఎం, ఆ తర్వాత వదిలిన ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సాంగ్ మ్యూజిక్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో, పెద్ది సినిమాను నెక్స్ట్ లెవల్‌లో రూపొందించాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

    peddi-ott-partner-netflix-locked
    peddi-ott-partner-netflix-locked

    Peddi: మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది చిత్రాన్ని రిలీజ్

    అందుకు తగట్టే ఇప్పటి వరకూ వచ్చిన అప్‌డేట్స్‌తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. పాన్ ఇండియా వైడ్‌గా మార్చి 27న చరణ్ బర్త్ డే సందర్భంగా పెద్ది చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. త్వరలో ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ కూడా రాబోతోంది. ఇక, తాజాగా చరణ్ మాట్లాడుతూ, ఈ సినిమా తనకి ఎంతో ప్రత్యేకమైనదని వెల్లడించాడు. ఇప్పటి వరకూ చేసిన సినిమాలన్నీ ఒకెత్తైతే పెద్ది ఒక్కటే ఒకెత్తు అని అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్ళాడు.

    అయితే, ఈ మధ్య ఈ సినిమా మేకర్స్ చెప్పిన మార్చి 27న రిలీజ్ కాకపోవచ్చుననే మాట వినిపించింది. పోస్ట్ పోన్ అవుతుందన్న వార్తలు బాగా వైరల్ అయ్యాయి. కానీ, అవన్నీ పుకార్లేనని చరణ్ మరోసారి కన్‌ఫర్మ్ చేశాడు. ఇక, ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా పూర్తైంది. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు దక్కించుకున్నారు. భారీ మొత్తం చెల్లించి పాన్ ఇండియా భాషలలో ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబందించిన అప్‌డేట్‌ను మేకర్స్ తాకాగా అందించారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.