Mon. Jan 19th, 2026

    Puri-Slum Dog: డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని ఫిక్స్ చేసి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ అప్‌డేట్‌ను కనుమరోజు ఇస్తామని ప్రకటించిన పూరి బృందం అలాగే పూరి-సేతుపతి సినిమాకి ‘స్లమ్ డాగ్’ అనే వెరైటీ టైటిల్‌ని ప్రకటిస్తూ ఇందులో హీరోగా నటిస్తున్న విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని వదిలారు.

    ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ పూరి జగన్నాధ్ ఖాతాలో హిట్ చేరలేదు. గత చిత్రం డబుల్ ఇస్మార్ట్, అంతకముందు వచ్చిన లైగర్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. విజయ్ దేవరకొండ హీరోగా మొదలు పెట్టిన జనగణమన సినిమా ఆగిపోయింది. ఇలాంటి నేపథ్యంలో దాదాపు మన టాలీవుడ్ హీరోలెవరూ పూరికి డేట్స్ ఇవ్వడానికి మొహం చాటేశారని టాక్ వినిపించింది.

    puri-slum-dog-movie-first-look-vijay-sethupathi
    puri-slum-dog-movie-first-look-vijay-sethupathi

    Puri-Slum Dog: విజయ్ సేతుపతితో సినిమా

    దీంతో, తమిళంలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొని తెలుగులోనూ సైరా, ఉప్పెన లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతితో సినిమాను ప్రకటించాడు పూరి జగన్నాధ్. ఈ కాంబో అసలు ఎవరూ ఊహించలేదనే చెప్పాలి. పైగా, హీరోయిన్‌గా సంయుక్త..కీలక పాత్రలో టబు ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొత్తానికి, ఈ సినిమా షూటింగ్ పూర్తై..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది.

    అయితే, పూరి సినిమా అంటే..ఎన్ని ఫ్లాపులొచ్చినా కూడా కొత్త సినిమాపై ఆసక్తి బాగా ఉంటుంది. అలాగే, పూరి-సేతుపతి సినిమాపై ఉండి..ఈ మూవీ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకముందు రెండుసార్లు ప్లాన్ చేసి డ్రాపయ్యారు. ఫైనల్‌గా ఇప్పుడు ఈ మూవీ ‘స్లమ్ డాగ్’గా రాబోతుందని వెల్లడించారు. ఇక, తాజాగా వచ్చిన పోస్టర్ పూరి మార్క్ ఇంటెన్సివ్ కాన్సెప్ట్ కనిపిస్తోంది. పైగా టైటిల్ కి 33 టెంపుల్ రోడ్ అనే ట్యాగ్ పెట్టడం ఇంకా ఆసక్తిగా ఉంది. మొత్తానికి, కాస్త గ్యాప్ తీసుకున్న పూరి, ఈసారి సాలీడ్ హిట్ కొట్టబోతున్నాడని తాజా పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.